Telugu Global
Cinema & Entertainment

పెద్ద మనసు చాటుకున్న నిఖిల్

కరోనాను ఎదుర్కొనేందుకు టాలీవుడ్ అంతా కదిలింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు తమకు తోచిన విధంగా విరాళాలు ఇస్తూ తమ మంచి హృదయాన్ని చాటుకుంటున్నారు. అయితే అందరిలా డొనేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకోలేదు నిఖిల్. ఏకంగా రంగంలోకి దిగాడు. కరోనా నివారణ కోసం నిఖిల్ ఒక అడుగు ముందుకేశాడు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్యులు, మెడికల్ సిబ్బందికి బాసటగా నిలిచాడు. వాళ్ల కోసం పర్సనల్ ప్రొటక్షన్ కిట్స్ ను అందించాడు. 2వేల ఎన్-95 మాస్కులు, మరో […]

పెద్ద మనసు చాటుకున్న నిఖిల్
X

కరోనాను ఎదుర్కొనేందుకు టాలీవుడ్ అంతా కదిలింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు తమకు తోచిన విధంగా విరాళాలు ఇస్తూ తమ మంచి హృదయాన్ని చాటుకుంటున్నారు. అయితే అందరిలా డొనేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకోలేదు నిఖిల్. ఏకంగా రంగంలోకి దిగాడు.

కరోనా నివారణ కోసం నిఖిల్ ఒక అడుగు ముందుకేశాడు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్యులు, మెడికల్ సిబ్బందికి బాసటగా నిలిచాడు. వాళ్ల కోసం పర్సనల్ ప్రొటక్షన్ కిట్స్ ను అందించాడు. 2వేల ఎన్-95 మాస్కులు, మరో 2వేలు రీ-యూజబుల్ హ్యాండ్ గ్లౌజులు, 2వేల కళ్లజోళ్లు, భారీ సంఖ్యలో శానిటైజర్లు, 10వేల ఫేస్ మాస్కులు రెడీ చేశారు. వీటన్నింటినీ తీసుకొని గాంధీ హాస్పిటల్ కు వెళ్లి ఆరోగ్య శాఖ అధికారులకు స్వయంగా అందజేశాడు. అంతేకాదు.. అక్కడున్న అధికారితో కలిసి కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు

డబ్బులు అందరూ ఇస్తారు. కానీ ఇలా ముందుకొచ్చి ఎంతమంది సాయం చేస్తారు. మరీ ముఖ్యంగా హీరో స్థాయి వ్యక్తి ఇలా క్షేత్రస్థాయిలో దిగి సహాయం చేయడం గొప్ప విషయం. దీంతో నిఖిల్ అందరికీ నచ్చేశాడు. ఇప్పుడే కాదు, గతంలో హుద్ హుద్ వచ్చినప్పుడు కూడా పలు ప్రాంతాల్లో పర్యటించి, స్వయంగా తనే బాధితులకు మంచినీళ్లు, ఆహారం అందించి తన పెద్ద మనసు చాటుకున్నాడు నిఖిల్.

ఆపద వచ్చినప్పుడు ఎక్కడో ఉండి డబ్బు సాయం చేయడం తనకు ఇష్టం ఉండదని, పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు నిఖిల్. సమస్య ఎక్కడుంటే అక్కడకు వెళ్లి తోచిన విధంగా సాయం అందిస్తేనే తన మనసుకు తృప్తిగా ఉంటుందని తెలిపాడు. నిఖిల్ నిజంగా హీరో.

First Published:  29 March 2020 2:10 AM GMT
Next Story