Telugu Global
International

24 గంటల్లో 149 కేసులు... 873 దాటిన కరోనా మార్క్‌

దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. 24 గంటల్లో 149 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం ఇప్పుడు 873 కేసులు దాటాయి. మరో 24 గంటల్లో  వంద కేసులు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ కరోనాతో 19 మంది మృతిచెందారు. వైరస్‌ సోకిన బాధితుల్లో మొత్తం 79 మంది కోలుకున్నారు. మరో 775 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే 59 కేసులు దాటాయి. మహారాష్ట్రలో కరోనా వేగంగా […]

24 గంటల్లో 149 కేసులు... 873 దాటిన కరోనా మార్క్‌
X

దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. 24 గంటల్లో 149 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం ఇప్పుడు 873 కేసులు దాటాయి. మరో 24 గంటల్లో వంద కేసులు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ కరోనాతో 19 మంది మృతిచెందారు.

వైరస్‌ సోకిన బాధితుల్లో మొత్తం 79 మంది కోలుకున్నారు. మరో 775 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే 59 కేసులు దాటాయి. మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే అక్కడ 177 కేసులు పాజిటివ్‌ వచ్చాయి. ఆ తర్వాత కేరళలో 165, కర్నాకటలో 55, రాజస్థాన్‌లో 46, గుజరాత్‌ ,ఉత్తరప్రదేశ్‌లో 44 చొప్పున కేసులు రికార్డు అయ్యాయి.

దేశంలో నిత్యావసరాల సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ, తెలంగాణలో ట్రక్‌లకు ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో కూడా ఐడికార్డులు, ప్రత్యేక యూనిఫామ్‌లు ఉంటే అనుమతి ఇస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 5లక్షల 95వేల మందికి వైరస్‌ సోకింది. 27 వేల మంది చనిపోయారు. ప్రస్తుతం చైనాను దాటి అమెరికాలో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య 86 వేలు దాటి పరుగులు పెడుతోంది. రెండు రోజుల్లో లక్ష కూడా దాటే సూచనలు కనిపిస్తున్నాయి.

First Published:  28 March 2020 12:55 AM GMT
Next Story