వ్యూహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత… ప్రతి ఒక్కరికీ హెల్త్ కోడ్
కరోనా వైరస్‌కు సెంటర్‌గా మారిన చైనాలోని వ్యూహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేశారు. దాదాపు తొమ్మిది వారాల తర్వాత జనం కాలు బయటపెట్టారు.ఉదయం ఐదుగంటల 25 నిమిషాలకు తొలి బస్ బయలుదేరింది. 117 బస్ రూట్లలో బస్‌లు అనుమతి ఇచ్చారు. శనివారం నుంచి ఆరు రూట్లలో మెట్రో సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు, ప్రతి బస్‌లో డ్రైవర్‌తో పాటు ఓ సెప్టీ సూపర్‌వైజర్‌ను ప్రభుత్వం నియమించింది. బస్‌లో ఎక్కేముందు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని చెక్ చేయడమే ఈ సూపర్‌వైజర్ […]

కరోనా వైరస్‌కు సెంటర్‌గా మారిన చైనాలోని వ్యూహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేశారు. దాదాపు తొమ్మిది వారాల తర్వాత జనం కాలు బయటపెట్టారు.ఉదయం ఐదుగంటల 25 నిమిషాలకు తొలి బస్ బయలుదేరింది. 117 బస్ రూట్లలో బస్‌లు అనుమతి ఇచ్చారు. శనివారం నుంచి ఆరు రూట్లలో మెట్రో సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు,
ప్రతి బస్‌లో డ్రైవర్‌తో పాటు ఓ సెప్టీ సూపర్‌వైజర్‌ను ప్రభుత్వం నియమించింది. బస్‌లో ఎక్కేముందు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని చెక్ చేయడమే ఈ సూపర్‌వైజర్ పని. ప్రతి ఒక్కరు తమ హెల్త్‌కోడ్‌ను ఈ సూపర్‌వైజర్‌కు చూపించాలి.
బస్ డోర్‌కు ఓ క్యూ ఆర్ కోడ్‌ను అతికించారు. ఈ క్యూ ఆర్‌కోడ్‌ను స్కాన్ చేస్తే వారి హెల్త్ హిస్టరీ బయటకు వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని సూపర్ వైజర్ చెక్ చేస్తారు. వారికి కరోనా లక్షణాలు లేకపోతే బస్‌లోకి అనుమతి ఇస్తారు. బస్ ఎక్కేవారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. 65 ఏళ్లు దాటిన వారు ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించకపోవడమే మేలని అధికారులు సూచించారు.
స్మార్ట్‌ఫోన్లు యూజ్ చేయని వారికోసం ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. క్యూ ఆర్ కోడ్ లేకపోతే ఆ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బస్‌లోకి అనుమతి ఇస్తారు. ఇలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టి లాక్‌డౌన్ ఎత్తివేసింది చైనా ప్రభుత్వం.
మన దగ్గర వాట్సాప్ ఉన్నట్లే చైనా వి చాట్ ఉంది. వి చాట్ ద్వారానే కరోనా లక్షణాలు ఉన్న వారిని కనిపెట్టారు అక్కడి అధికారులు. టెక్నాలజీ వాడి అక్కడ కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టారు. జనవరి 23న అక్కడ లాక్‌డౌన్ ప్రకటిస్తే…తొమ్మిది వారాల తర్వాత ఇప్పుడు ఎత్తివేశారు.