Telugu Global
International

కరోనా ఎఫెక్ట్ : 1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ఆర్థిక మంత్రి

కరోనా విలయతాండం చేస్తున్న వేళ దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడగు, బలహీనులకు ఊరట కలిగించే ప్యాకేజీ ప్రకటించింది. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో 1.70 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సందర్భంగా ఆహార అవసరాలతో పాటు రోజు వారీ అవసరాలకు సాయంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో […]

కరోనా ఎఫెక్ట్ : 1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ఆర్థిక మంత్రి
X

కరోనా విలయతాండం చేస్తున్న వేళ దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడగు, బలహీనులకు ఊరట కలిగించే ప్యాకేజీ ప్రకటించింది.

ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో 1.70 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సందర్భంగా ఆహార అవసరాలతో పాటు రోజు వారీ అవసరాలకు సాయంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.70 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.

వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ఈ ప్యాకేజీ రూపొందించినట్లు ఆమె చెప్పారు. ఈ ప్యాకేజీ పేద కార్మికులను ఆదుకునే లక్ష్యంగా రూపొందించామని ఆమె వివరించారు.

ఇక కరోనాపై పోరాటంలో ముందు వరుసలలో ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, ఆశా వర్కర్లకు ఒక్కొక్కరికీ 50 లక్షల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని రెండు విధాలుగా అందిస్తామని ఆమె చెప్పారు. ఈ పథకం ద్వారా రానున్న మూడు నెలలకు ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల బియ్యం పంపిణీ చేస్తామని.. లాక్‌డౌన్ కారణంగా ఎవరూ ఆహారం లేకుండా ఉండే పరిస్థితిని రానివ్వమని అన్నారు. ఇప్పుడు ఇస్తున్న 5 రూపాయల కేజీ బియ్యానికి అదనంగా, ఉచితంగా అందిస్తామన్నారు. అలాగే గోదుమలు కూడా రేషన్‌కు అదనంగా మరో 5 కేజీలు ఉచితంగా ఇస్తామన్నారు. ఇక ఇప్పుడు ఇస్తున్న 1 కేజీ పప్పు ధాన్యాలకు అదనంగా మరో కేజీ పప్పు ఇస్తామని మంత్రి చెప్పారు.

ఇవన్నీ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మూడు నెలల పాటు అందిస్తామన్నారు. అలాగే నేరుగా బ్యాంకు అకౌంట్లకు నగదు బదిలీ చేయడం ద్వారా లబ్దిదారులకు సాయం చేస్తామని మంత్రి చెప్పారు.

First Published:  26 March 2020 3:29 AM GMT
Next Story