Telugu Global
NEWS

కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ నటుడు

ఇప్పుడు కరోనా వైరస్ తో దేశమంతా లాక్ డౌన్ అయ్యింది. ఎక్కడివారు అక్కడే ఇళ్లలోనే ఉంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనుంచి కాలు బయటపెట్టడం లేదు. అయితే షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లి హైదరాబాద్ వచ్చిన ఒక టాలీవుడ్ నటుడికి కరోనా లక్షణాలు బయటపడ్డాయని సమాచారం. మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం.. ఆ నటుడు హైదరాబాద్ లో కొన్ని రోజులు ఉన్నాడు. కరోనాతో సెలవులు ఇచ్చేయడంతో తన స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్లినట్టు […]

కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ నటుడు
X

ఇప్పుడు కరోనా వైరస్ తో దేశమంతా లాక్ డౌన్ అయ్యింది. ఎక్కడివారు అక్కడే ఇళ్లలోనే ఉంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనుంచి కాలు బయటపెట్టడం లేదు.

అయితే షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లి హైదరాబాద్ వచ్చిన ఒక టాలీవుడ్ నటుడికి కరోనా లక్షణాలు బయటపడ్డాయని సమాచారం. మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం.. ఆ నటుడు హైదరాబాద్ లో కొన్ని రోజులు ఉన్నాడు. కరోనాతో సెలవులు ఇచ్చేయడంతో తన స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్లినట్టు తెలిసింది.

అక్కడికి వచ్చినప్పటి నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అతడికి కరోనా లక్షణాలు ఉండడంతో గుంటూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.

ఈ నటుడు టాలీవుడ్ లో సహాయ నటుడిగా కనిపిస్తున్నాడు. వారంరోజులుగా లక్షణాలు కనిపించినా హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి వెళ్లలేదు. అక్కడే చూపించుకుని ఉంటే ఈ ప్రమాదం తప్పేది. ఇప్పుడు ఇతడు ఎంతమందికి అంటించాడనే భయం నెలకొంది. ఇతడితో సన్నిహితంగా మెలిగిన వారంతా ఇప్పుడు హడలి పోతున్నారు.

ఇతడి రక్తనమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపారు. రిపోర్ట్ వచ్చాక అధికారికంగా ప్రకటించనున్నారు.

First Published:  24 March 2020 4:53 AM GMT
Next Story