Telugu Global
International

14 గంటల భారత లాక్ డౌన్ కు రోహిత్ హ్యాట్సాఫ్

జనసంచారం లేకపోడంతో పరవశించిన ప్రకృతి మాత రోమ్ లో హంసలు, వెనిస్ లో డాల్ఫిన్ల కేరింతలు చావుకుపెడితే లంకణానికి వచ్చినట్లుగా తయారయ్యింది మానవాళి పరిస్థితి. కరోనా వైరస్ ప్రకోపంతో విలవిలలాడిన మనిషి ప్రపంచవ్యాప్తంగా.. అయిష్టంగానే 14 గంటల స్వీయ గృహ నిర్భందం పాటించాడు. భారత్ లో సైతం తెలంగాణాలో 24 గంటలు, మిగిలిన భారత రాష్ట్ర్రాలలో 14 గంటల జనతా కర్ప్యూను ప్రజలంతా ఎక్కడలేని అంకితభావంతో పాటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్ర్రాల ముఖ్యమంత్రుల చొరవ, […]

14 గంటల భారత లాక్ డౌన్ కు రోహిత్ హ్యాట్సాఫ్
X
  • జనసంచారం లేకపోడంతో పరవశించిన ప్రకృతి మాత
  • రోమ్ లో హంసలు, వెనిస్ లో డాల్ఫిన్ల కేరింతలు

చావుకుపెడితే లంకణానికి వచ్చినట్లుగా తయారయ్యింది మానవాళి పరిస్థితి. కరోనా వైరస్ ప్రకోపంతో విలవిలలాడిన మనిషి ప్రపంచవ్యాప్తంగా.. అయిష్టంగానే 14 గంటల స్వీయ గృహ నిర్భందం పాటించాడు.

భారత్ లో సైతం తెలంగాణాలో 24 గంటలు, మిగిలిన భారత రాష్ట్ర్రాలలో 14 గంటల జనతా కర్ప్యూను ప్రజలంతా ఎక్కడలేని అంకితభావంతో పాటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్ర్రాల ముఖ్యమంత్రుల చొరవ, పూనికకు…ప్రజల సంయమనం, విజ్ఞత సైతం కూడా తోడుకావడంతో 14 గంటల లాక్ డౌన్ విజయవంతమయ్యింది.

ప్రజలంతా మరో ఆలోచనన లేకుండా లాక్ డౌన్ పాటించడం పట్ల భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే..ప్రకృతిమాతకు కోపం వస్తే..ఏం జరుగుతుందో మనుషులంతా ఓసారి గమనించాలని పిలుపునిచ్చాడు.

మనిషి విధ్వంసానికి పాల్పడితే ప్రకృతి పలురూపాలలో ప్రతీకారచర్యలు తీసుకొంటుందని, తననుతానే బాగుచేసుకొనే మార్గాలు వెతుక్కొంటుందని, పేట్రేగిపోయే మనిషికి…. కరోనా వైరస్ రూపంలో పగ్గాలు వేయటమే కాదు…కట్టడి సైతం చేసిందనటానికి ప్రస్తుత ప్రకృతి ప్రకోపమే కారణమని రోహిత్ శర్మ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా పేర్కొన్నాడు.

విశ్వవిఖ్యాత వెనిస్ కాలువల్లోని దృశ్యాలను పోస్ట్ చేశాడు. నిరంతరం వచ్చేపోయే విదేశీ ప్రయాణికులు, జనసంచారంతో కిటకిటలాడుతూ కనిపించే వెనిస్ జలమార్గాలు…. లాక్ డౌన్ పుణ్యమా అంటూ నిర్మానుష్యం కావడంతో..ప్రకృతిమాత పులకించిందని, సేదతీరిందని, కాలువలోని డాల్ఫిన్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకోడమే కాదు… ఎక్కడలేని ఉత్సాహంతో కేరింతలు కొట్టాయని, రంగురంగుల, రకరకాల చేపలు నిర్భయంగా పైకి వచ్చాయని, రోమ్ సరసుల్లో హంసలు హాయిగా అటూఇటూ జలకాలాడయని పేర్కొంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ప్రకృతిపట్ల మనిషి తనవంతు బాధ్యత నిర్వర్తించాలని, విధ్వంసాన్ని తగ్గించాలని, మనిషిని మించిన అత్యంత ప్రమాదకరమైన వైరస్ మరొకటి లేదన్నవిమర్శను నిజం చేయకుండా నిరూపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని చెప్పాడు.

లాక్ డౌన్ లో పాలుపంచుకొన్న ప్రజలందరికీ పలువురు క్రీడాప్రముఖులు, దిగ్గజాలు అభినందనలు తెలిపారు. కరోనా మహమ్మారిని రూపుమాపేవరకూ అందరూ పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  22 March 2020 9:11 PM GMT
Next Story