Telugu Global
National

మనసున్న ప్రకాష్ 'రాజు'

సినిమా నటుడు ప్రకాష్ రాజ్ తెరపై విలనిజాన్ని పండిస్తాడేమో కాని బయట మాత్రం ఎంతో మంచి మనసున్న వ్యక్తి. గ్రామాలను దత్తత తీసుకోవడం నుంచి తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వాళ్లకు చేతనైనంత చేయడం ఆయనకు అలవాటు. ఇదే విషయాన్ని పలుమార్లు ఇతర నటులు కూడా చెప్పారు. బయట ప్రకాష్ రాజ్ దాతృత్వాన్ని చూసి అందరూ మెచ్చకుంటూ ఉంటారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా వ్యాపారాలు, సినిమాలు, ఆటలు బంద్ అయిన నేపథ్యంలో ఎంతో మంది పనుల్లేక […]

మనసున్న ప్రకాష్ రాజు
X

సినిమా నటుడు ప్రకాష్ రాజ్ తెరపై విలనిజాన్ని పండిస్తాడేమో కాని బయట మాత్రం ఎంతో మంచి మనసున్న వ్యక్తి. గ్రామాలను దత్తత తీసుకోవడం నుంచి తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వాళ్లకు చేతనైనంత చేయడం ఆయనకు అలవాటు. ఇదే విషయాన్ని పలుమార్లు ఇతర నటులు కూడా చెప్పారు. బయట ప్రకాష్ రాజ్ దాతృత్వాన్ని చూసి అందరూ మెచ్చకుంటూ ఉంటారు.

దేశవ్యాప్తంగా కరోనా కారణంగా వ్యాపారాలు, సినిమాలు, ఆటలు బంద్ అయిన నేపథ్యంలో ఎంతో మంది పనుల్లేక పస్తులుంటున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ తాను ఏం చేశాడో ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.

‘జనతా కర్ఫ్యూ’తో… నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో, నా ఫార్మ్ హౌస్ లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ… నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబందించి దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి ఆలోచించాను.

కరోనా మహమ్మారితో పాటిస్తున్న సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఆ దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇక్కడితో పూర్తి కాదు… నా శక్తి మేరకు చేస్తాను.

మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే… మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని… జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది… అంటూ ట్విట్ చేశారు. ప్రకాశ్ రాజ్ ఔదార్యాన్ని అందరూ మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

First Published:  23 March 2020 2:23 AM GMT
Next Story