Telugu Global
National

కరోనాకు మందని గోమూత్రం తాగించిన బీజేపీ నేత.... ఆసుపత్రి పాలైన మున్సిపల్ కార్మికుడు..!

కరోనాకు మందును ఇంత వరకు ఏ దేశమూ కనిపెట్టలేదు. జర్మనీలో డ్రగ్ ట్రయల్స్ నడుస్తున్నాయి. కాని, ఒక బీజేపీ నేత మాత్రం గోమూత్రం కరోనా నుంచి రక్షిస్తుందని.. కరోనా వచ్చినోళ్లకు తగ్గిస్తుందని ప్రకటించాడు. అంతే కాకుండా గో మూత్రం తాగే క్యాంపు నిర్వహించాడు. ఈ క్రమంలో అక్కడ గో మూత్రం సేవించిన మున్సిపల్ కార్మికుడు ఒకరు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిపాలయ్యాడు. దీంతో ఆ క్యాంపు నిర్వహించిన బీజేపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కోల్‌కతాలో […]

కరోనాకు మందని గోమూత్రం తాగించిన బీజేపీ నేత.... ఆసుపత్రి పాలైన మున్సిపల్ కార్మికుడు..!
X

కరోనాకు మందును ఇంత వరకు ఏ దేశమూ కనిపెట్టలేదు. జర్మనీలో డ్రగ్ ట్రయల్స్ నడుస్తున్నాయి. కాని, ఒక బీజేపీ నేత మాత్రం గోమూత్రం కరోనా నుంచి రక్షిస్తుందని.. కరోనా వచ్చినోళ్లకు తగ్గిస్తుందని ప్రకటించాడు. అంతే కాకుండా గో మూత్రం తాగే క్యాంపు నిర్వహించాడు. ఈ క్రమంలో అక్కడ గో మూత్రం సేవించిన మున్సిపల్ కార్మికుడు ఒకరు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిపాలయ్యాడు. దీంతో ఆ క్యాంపు నిర్వహించిన బీజేపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కోల్‌కతాలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర కోల్‌కతాలోని జొరాసకో ప్రాంతంలో స్థానిక బీజేపీ నేత నారాయణ చటర్జీ సోమవారం రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. అక్కడి గోశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవు మూత్రాన్ని పంచాడు. అంతే కాకుండా ఆవు మూత్రంలోని మహత్యం అంటూ ఉపన్యాసం కూడా ఇచ్చాడు. కాగా, ఆ గోశాలకు సమీపంలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికుడు గోమూత్రాన్ని తాగాడు. వెంటనే అతను తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు.

బాధితుడు పిర్యాదు మేరకు చటర్జీని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దీనిపై రాష్ట్ర బీజేపీ స్పందించింది. చటర్జీ అరెస్టును తీవ్రంగా ఖండించిది. చటర్జీ గోమూత్రాన్ని పంచింది వాస్తవమే అయినా.. అతను బలవంతంగా ఎవరికీ తాగించలేదని.. అలాగే గోమూత్రంలో మహత్యం ఉందని కూడా ప్రచారం చేయలేదని చెప్పారు. అతను స్వచ్ఛందంగానే తాగమన్నాడు తప్ప ఎవరినీ బలవంతం చేయలేదు.. కాని ఎలా అప్రజాస్వామికంగా అతడిని అరెస్టు చేస్తారని బీజేపీ అంటోంది.

పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. గో మూత్రం తాగడం హానికరమేమీ కాదని అన్నారు. కాగా మరో బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ మాత్రం ఈ వాదనను కొట్టేశారు. గోమూత్రం కరోనాను తగ్గిస్తుందన్నది పూర్తిగా అశాస్త్రీయం అన్నారు.

First Published:  18 March 2020 11:01 PM GMT
Next Story