Telugu Global
NEWS

సౌతాఫ్రికా క్రికెటర్ల 14 రోజుల ఏకాంతం

భారత్ నుంచి స్వదేశం చేరిన సఫారీలు భారత్ తో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడటానికి వచ్చి…కరోనా భయంతో విలవిలలాడిన సౌతాఫ్రికా క్రికెటర్లు… చచ్చీచెడీ… బతుకుజీవుడా అంటూ ఎట్టకేలకు స్వదేశం చేరుకొన్నారు. అయితే…క్వింటన్ డీ కాక్ నాయకత్వంలోని సఫారీ క్రికెటర్ల బృందమంతా…తమకుతాము 14 రోజులపాటు ఐసోలేషన్ వార్డు లో ఉండాలని నిర్ణయించారు. సౌతాప్రికా నుంచి దుబాయి మీదుగా ధర్మశాల, కోల్ కతా నగరాలలో పర్యటించి…తిరిగి దుబాయ్ మీదుగా స్వదేశానికి చేరిన సఫారీలు కేవలం పదిరోజులపాటు మాత్రమే భారతగడ్డపై గడిపారు. ధర్మశాల వేదికగా […]

సౌతాఫ్రికా క్రికెటర్ల 14 రోజుల ఏకాంతం
X
  • భారత్ నుంచి స్వదేశం చేరిన సఫారీలు

భారత్ తో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడటానికి వచ్చి…కరోనా భయంతో విలవిలలాడిన సౌతాఫ్రికా క్రికెటర్లు… చచ్చీచెడీ… బతుకుజీవుడా అంటూ ఎట్టకేలకు స్వదేశం చేరుకొన్నారు.

అయితే…క్వింటన్ డీ కాక్ నాయకత్వంలోని సఫారీ క్రికెటర్ల బృందమంతా…తమకుతాము 14 రోజులపాటు ఐసోలేషన్ వార్డు లో ఉండాలని నిర్ణయించారు. సౌతాప్రికా నుంచి దుబాయి మీదుగా ధర్మశాల, కోల్ కతా నగరాలలో పర్యటించి…తిరిగి దుబాయ్ మీదుగా స్వదేశానికి చేరిన సఫారీలు కేవలం పదిరోజులపాటు మాత్రమే భారతగడ్డపై గడిపారు.

ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలివన్డే వానదెబ్బతో రద్దు కాగా…లక్నో, కోల్ కతా వేదికలుగా జరగాల్సిన ఆఖరి రెండువన్డేలను కరోనా వైరస్ భయంతో రద్దు చేసుకోవాలని..రెండు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి.

దీంతో పర్యటన అర్థంతరంగా రద్దుకావడంతో సఫారీ క్రికెటర్లు అష్టకష్టాలు పడి, తీవ్రఆందోళన నడుమ స్వదేశానికి చేరుకోగలిగారు. తాము దుబాయి మీదుగా భారత్ కు వెళ్లి, తిరిగి దుబాయి మీదుగానే స్వదేశానికి తిరిగి వచ్చామని, ముందుజాగ్రత్త చర్యగా తమ బృందం తమకుతాముగా ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించినట్లు సౌతాఫ్రికా టీమ్ వైద్యుడు డాక్టర్ షుల్బ్ మంజిరా తెలిపారు.

తమ బృందానికి కరోనా వైరస్ సోకే అవకాశం లేకుండా భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, శానిటైజ్ చేసిన ప్రత్యేక చార్టర్డ్ విమానాలలో మాత్రమే తమ ప్రయాణం సాగిందని వైద్యుడు గుర్తు చేశారు. అయినా…ముందుజాగ్రత్త చర్యగా తామంతా 14 రోజులపాటు ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించామని, ఇది కేవలం తమకుతాము తీసుకొన్న నిర్ణయం మాత్రమేనని తెలిపారు.

14 రోజుల తర్వాతే తమకు వైరస్ సోకిందో..లేదో తేలుతుందని, ఆ తర్వాతే తమతమ కుటుంబసభ్యులతో కలుస్తామని వివరించారు.

First Published:  18 March 2020 11:45 PM GMT
Next Story