Telugu Global
NEWS

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన సఫారీ క్రికెటర్లు

కరోనా దెబ్బతో కోల్ కతాలో చిక్కుకుపోయిన సౌతాఫ్రికా టీమ్ భారత్ తో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో తలపడటానికి సౌతాఫ్రికాజట్టు ఏముహూర్తాన తమదేశం నుంచి బయలుదేరి వచ్చిందో కానీ…ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వదేశానికి బతుకుజీవుడా అంటూ తిరిగివెళుతోంది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలివన్డే కుండపోత వర్షంతో రద్దు కావడంతో…సఫారీజట్టు…రెండోవన్డేలో పాల్గొనటానికి లక్నో చేరుకొంది. అయితే…ఇదే సమయంలో.. కరోనా హెచ్చరికలు ఎక్కువకావడం, భారత ఆరోగ్యమంత్రిత్వశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ క్రీడాసంఘాలను హెచ్చరించడంతో…భారత క్రికెట్ బోర్డు.. ఐపీఎల్ ను ఏప్రిల్ 15 […]

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన సఫారీ క్రికెటర్లు
X
  • కరోనా దెబ్బతో కోల్ కతాలో చిక్కుకుపోయిన సౌతాఫ్రికా టీమ్

భారత్ తో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో తలపడటానికి సౌతాఫ్రికాజట్టు ఏముహూర్తాన తమదేశం నుంచి బయలుదేరి వచ్చిందో కానీ…ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వదేశానికి బతుకుజీవుడా అంటూ తిరిగివెళుతోంది.

ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలివన్డే కుండపోత వర్షంతో రద్దు కావడంతో…సఫారీజట్టు…రెండోవన్డేలో పాల్గొనటానికి లక్నో చేరుకొంది.

అయితే…ఇదే సమయంలో.. కరోనా హెచ్చరికలు ఎక్కువకావడం, భారత ఆరోగ్యమంత్రిత్వశాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ క్రీడాసంఘాలను హెచ్చరించడంతో…భారత క్రికెట్ బోర్డు.. ఐపీఎల్ ను ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేయడంతో పాటు…సౌతాఫ్రికాతో జరగాల్సిన ఆఖరిరెండువన్డేలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో లక్నోలో మకాం వేసిన సఫారీ క్రికెట్ జట్టు సభ్యులు…హుటాహుటిన కోల్ కతాకు చేరుకొన్నారు. కోల్ కతా నుంచి స్వదేశానికి తిరిగివెళ్లాలనుకొన్న సౌతాఫ్రికా క్రికెటర్లకు…కోల్ కతా విమానాశ్రయానికి సమీపంలోని ఆలీపోర్ లోని ఓ స్టార్ హోటెల్ లో బస ఏర్పాటు చేశారు.

ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం మూడో వన్డే ముగిసిన వెంటనే కోల్ కతా నుంచి దుబాయ్ మీదుగా వెళ్లే విమానంలో సౌతాఫ్రికా క్రికెటర్లు స్వదేశానికి తిరిగివెళ్లాల్సి ఉంది.

అయితే…స్వదేశానికి తిరిగి వెళ్లే విమానసర్వీసు రద్దుకావడంతో గందరగోళం నెలకొంది. ఓ వైపు కరోనా వైరస్ భయం… మరోవైపు స్వదేశానికి తిరిగివెళతామాలేదా అన్న ఆందోళన మరోవైపు సఫారీక్రికెటర్లను ఉక్కిరి బిక్కిరి చేసింది.

దీనికి తోడు బెంగాల్ క్రికెట్ సంఘం సైతం.. సఫారీ క్రికెటర్లను కంటికిరెప్పలా కాపాడటం కోసం ఓ ప్రత్యేక వైద్యుల బృందాన్ని, భద్రతదళాన్ని ఏర్పాటు చేసింది.

తమకు బస ఏర్పాటు చేసిన హోటెల్ నుంచి బయటకు రావద్దని, గుమికూడిన జనాలతో కలవవద్దంటూ హెచ్చరికలు జారీ చేయడంతో సౌతాఫ్రికా క్రికెటర్లు మరింత ఆందోళనకు గురయ్యారు. భారత పర్యటనకు ఎందుకు వచ్చామురూ భగవంతుడా అంటూ.. స్వదేశీ ప్రయాణానికి ఎదురుచూస్తున్నారు.

ఏ క్షణంలోనైనా సౌతాఫ్రికా క్రికెటర్లు స్వదేశానికి కోల్ కతా నుంచి తిరిగివెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే తమ కెరియర్ లో ఎన్నిదేశాలు పర్యటించిన సఫారీ క్రికెటర్లకు.. కరోనా వైరస్ నేపథ్యంలో…భారత్ లో జరిపిన పర్యటన మాత్రం జీవితకాలం పీడకలగా మిగిలిపోతుంది.

First Published:  16 March 2020 8:35 PM GMT
Next Story