Telugu Global
NEWS

ఏపీలో ఏక‌గ్రీవాల జోరు " క‌డ‌ప జ‌డ్పీటీసీ వైసీపీ కైవ‌సం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హ‌వా మొద‌లైంది. జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఏకగ్రీవంగా మెజార్టీ స్థానాలు కైవ‌సం చేసుకుంది. క‌డ‌ప జిల్లా జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీకి ఎదురులేకుండా పోయింది. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలో మొత్తం 50 జ‌డ్పీటీసీలలో 38 సీట్లు ఏక‌గ్రీవమ‌య్యాయి. దీంతో జడ్పీ పీఠం వైసీపీ ద‌క్కించుకుంది. ఐదు నియోజకవర్గాల పరిధిలోని జ‌డ్పీటీసీ స్థానాల‌ను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పులివెందుల, రాయచోటి, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని […]

ఏపీలో ఏక‌గ్రీవాల జోరు  క‌డ‌ప జ‌డ్పీటీసీ వైసీపీ కైవ‌సం
X

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హ‌వా మొద‌లైంది. జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఏకగ్రీవంగా మెజార్టీ స్థానాలు కైవ‌సం చేసుకుంది. క‌డ‌ప జిల్లా జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీకి ఎదురులేకుండా పోయింది. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలో మొత్తం 50 జ‌డ్పీటీసీలలో 38 సీట్లు ఏక‌గ్రీవమ‌య్యాయి. దీంతో జడ్పీ పీఠం వైసీపీ ద‌క్కించుకుంది.

ఐదు నియోజకవర్గాల పరిధిలోని జ‌డ్పీటీసీ స్థానాల‌ను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పులివెందుల, రాయచోటి, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని జడ్పీటీసిసీ స్థానాలు వైసీపీ వ‌శ‌మ‌య్యాయి. జడ్పీ చైర్మన్ గా ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనంగా మారింది.

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీగా జడ్పీటీసీ స్థానాలను కైవ‌సం చేసుకుంది వైసీపీ. 65 జడ్పీటీసీ స్థానాలకు గాను 29 స్థానాలలో వైసీపీ సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 36 మండలాల్లో జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. ఇంకో ఐదు స్థానాలు గెలిస్తే చిత్తూరు జ‌డ్పీ కూడా వైసీపీ ఖాతాలో ప‌డుతుంది.

మ‌రోవైపు చిత్తూరు జిల్లాలో 858 ఎంపీటీసీ స్థానాలకు గాను 342 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమ‌య్యాయి.
ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాల్లో 19 మంది టిడిపి సభ్యులు ఉంటే 323 మంది వైసిపి సభ్యులు ఉన్నారు. ఇంత‌కుముందు ఎన్న‌డూ లేనివిధంగా ఈ సారి భారీగా ఏక‌గ్రీవ‌మ‌య్యాయి.

నెల్లూరు జిల్లాలోని 46 స్థానాల్లో 12 జడ్పిటిసి స్థానాలు ఏకగ్రీవమ‌య్యాయి. ప్ర‌కాశం జిల్లాలోని 56 జెడ్పీటీసీ స్థానాలకు గాను 14 వైసిపి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక్క‌డ జ‌డ్పీ ఛైర్మ‌న్ అభ్య‌ర్థి వెంకాయ‌మ్మ ఏక‌గ్రీవమ‌య్యాయి.

దర్శి మండలంలో 17 ఎంపిటిసి స్థానాలకు గాను 14 ఎంపిటిసి స్ధానాలను ఏకగ్రీవం కావడంతో ఎంపీపీ ప‌ద‌వి వైసీపీ ఖాతాలో చేరింది.

సింగరాయకొండ మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు గాను 12 స్థానాలలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమ‌య్యాయి. ఎంపీపీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది.

First Published:  14 March 2020 9:41 PM GMT
Next Story