Telugu Global
NEWS

మార్చి 31 వ‌ర‌కు నో మీటింగ్స్‌, నో స్కూల్స్‌

క‌రోనా కట్ట‌డికి తెలంగాణ ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. తెలంగాణ కేబినెట్ దాదాపు మూడు గంట‌ల పాటు చ‌ర్చించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. క‌రోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. ఇప్పటికే 500 కోట్ల నిధి ఉంది. ఇది సీఎస్ ఆధీనంలో… ఈ పరిస్థితులను ఎదుర్కొనేంద‌కు ప్ర‌త్యేక ఫండ్ ఏర్పాటు చేశారు. కొన్ని ముఖ్య‌మైన నిర్ణ‌యాలు 1. మార్చి 31 వ‌ర‌కు విద్యాసంస్థ‌లు […]

మార్చి 31 వ‌ర‌కు నో మీటింగ్స్‌, నో స్కూల్స్‌
X

క‌రోనా కట్ట‌డికి తెలంగాణ ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. తెలంగాణ కేబినెట్ దాదాపు మూడు గంట‌ల పాటు చ‌ర్చించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.

క‌రోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. ఇప్పటికే 500 కోట్ల నిధి ఉంది. ఇది సీఎస్ ఆధీనంలో… ఈ పరిస్థితులను ఎదుర్కొనేంద‌కు ప్ర‌త్యేక ఫండ్ ఏర్పాటు చేశారు.

కొన్ని ముఖ్య‌మైన నిర్ణ‌యాలు

1. మార్చి 31 వ‌ర‌కు విద్యాసంస్థ‌లు బంద్‌… స్కూళ్లు,కాలేజీలు మూసివేత‌

2. టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు టైమ్ టేబులు ప్ర‌కారం కొన‌సాగుతాయి.

3. పంక్షన్ హాల్ లు మూసివేత‌… ఇప్పటికే పెళ్లి డేట్ పిక్స్ అయితే పెళ్లిళ్లు చేసుకోవచ్చు.

4. అన్ని మ్యారేజ్ హాల్స్… మార్చ్ 31 వరకు జరిగే పెళ్లిళ్ల‌కు బుకింగ్స్ ఇవ్వవద్దు… ఒకవేళ ఇస్తే కఠిన చర్యలు ఉంటాయి.

5. బహిరంగ సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదు

6. స్పోర్ట్స్, జూ పార్క్, ఇండోర్ స్టేడియంలు మూసివేత‌… అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు.

7. ఆర్టీసీ బస్, మెట్రో రైల్ లు యధావిధిగా నడుస్తాయి.

8. షాపింగ్ మాల్స్‌, సూప‌ర్ మార్కెట్లు న‌డుస్తాయి

9. సినిమా హాల్స్, క్లబ్ లు మూసివేత.

ప్ర‌భుత్వం విధించిన ఈ ఆంక్ష‌ల‌ను ఎవరైనా అతిక్ర‌మిస్తే కఠిన చర్యలు ఉంటాయ‌ని సీఎం కేసీఆర్ హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే క‌రోనాను ఎదుర్కొనేందుకు ప్ర‌త్యేక సెంట‌ర్లు ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. 1020 బెడ్స్, 321 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లు , 240 వెంటిలేటర్ లు సిద్ధంగా ఉంచిన‌ట్లు తెలిపారు.

పంచాయతీ రాజ్, మున్సిపల్, ఫారెస్ట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ పోర్స్ ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. రోజుకు రెండు సార్లు ఆరోగ్య‌శాఖ‌మంత్రి ఆధ్వ‌ర్యంలో ప‌రిస్థితిని స‌మీక్షిస్తార‌ని వివ‌రించారు.

First Published:  14 March 2020 9:30 PM GMT
Next Story