Telugu Global
NEWS

సౌరాష్ట్ర్ర కలనిజమాయెగా!

రంజీట్రోఫీ నయా చాంపియన్ సౌరాష్ట్ర్ర ఫైనల్లో పోరాడి ఓడిన బెంగాల్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సౌరాష్ట్ర్ర జట్టు కల ఎట్టకేలకు నెరవేరింది. జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ నెగ్గాలన్న లక్ష్యం సాకారమయ్యింది. 2019-20 సీజన్ రంజీ టైటిల్ ను హోంగ్రౌండ్ సౌరాష్ట్ర్ర క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో సొంతం చేసుకోగలిగింది. మాజీ చాంపియన్ బెంగాల్ తో జరిగిన ఐదురోజుల ఫైనల్ ఆఖరిరోజు ఆటలో ఆతిథ్య సౌరాష్ట్ర్ర తొలిఇన్నింగ్స్ ఆధిక్యతన బెంగాల్ ను ఓడించడం ద్వారా […]

సౌరాష్ట్ర్ర కలనిజమాయెగా!
X
  • రంజీట్రోఫీ నయా చాంపియన్ సౌరాష్ట్ర్ర
  • ఫైనల్లో పోరాడి ఓడిన బెంగాల్

దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సౌరాష్ట్ర్ర జట్టు కల ఎట్టకేలకు నెరవేరింది. జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ నెగ్గాలన్న లక్ష్యం సాకారమయ్యింది.

2019-20 సీజన్ రంజీ టైటిల్ ను హోంగ్రౌండ్ సౌరాష్ట్ర్ర క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో సొంతం చేసుకోగలిగింది.
మాజీ చాంపియన్ బెంగాల్ తో జరిగిన ఐదురోజుల ఫైనల్ ఆఖరిరోజు ఆటలో ఆతిథ్య సౌరాష్ట్ర్ర తొలిఇన్నింగ్స్ ఆధిక్యతన బెంగాల్ ను ఓడించడం ద్వారా తొలిసారిగా విజేతగా నిలువగలిగింది.

బెంగాల్ లోయర్ ఆర్డర్ జోడీ అనుస్తూప్ ముజుందార్- ఆర్నవ్ నందీల భాగస్వామ్యాన్ని సౌరాష్ట్ర్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ విడదీయగలిగాడు. అనుస్తూప్ ను అవుట్ చేయడమే కాదు…టెయిల్ ఎండర్ ఆకాశ్ దీప్ ను రనౌట్ చేయడం ద్వారా బెంగాల్ ఆలౌట్ లో ప్రధానపాత్ర వహించాడు. దీంతో సౌరాష్ట్ర్ర జట్టుకు 44 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది.

రెండోఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర్ర బ్యాటింగ్ కొనసాగించినా…ఫలితం వచ్చే అవకాశం లేకపోడంతో…సౌరాష్ట్ర్రను విజేతగా ప్రకటించారు. గత ఏడాది ఫైనల్లో విదర్భ చేతిలో పరాజయం పొందిన సౌరాష్ట్ర్ర వరుసగా రెండోసంవత్సరం ఫైనల్స్ చేరడమే కాదు..విజేతగానూ నిలువగలిగింది.

సౌరాష్ట్ర కెప్టెన్ కమ్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ సీజన్లో మొత్తం 67 వికెట్లు పడగొట్టి…అత్యధిక వికెట్ల జాతీయ రికార్డును సమం చేయగలిగాడు. విజేత సౌరాష్ట్ర్ర జట్టుకు బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా ట్రోఫీని అందచేసారు.

మరోవైపు…13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రంజీఫైనల్స్ చేరిన బెంగాల్ చివరకు రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

First Published:  13 March 2020 7:58 PM GMT
Next Story