Telugu Global
Cinema & Entertainment

సమంత కొత్త సినిమా సంగతులు

జాను సినిమా వచ్చి దాదాపు నెల దాటుతోంది. ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో కూడా పెట్టేశారు. అయినప్పటికీ ఇంతవరకు సమంత తన నెక్ట్స్ సినిమా ఏంటనేది చెప్పలేదు. దీంతో ఆమెపై ఓ రేంజ్ లో పుకార్లు నడిచాయి. ఆమె తల్లి కాబోతోందంటూ కొందరు పుకార్లు సృష్టిస్తే.. ఆమెకు సరైన ఆఫర్లు రావడం లేదంటూ మరికొందరు రాసుకొచ్చారు. ఎట్టకేలకు ఈ పుకార్లకు చెక్ పెడుతూ కొత్త సినిమా ప్రకటించింది సమంత. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ […]

సమంత కొత్త సినిమా సంగతులు
X

జాను సినిమా వచ్చి దాదాపు నెల దాటుతోంది. ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో కూడా పెట్టేశారు. అయినప్పటికీ ఇంతవరకు సమంత తన నెక్ట్స్ సినిమా ఏంటనేది చెప్పలేదు. దీంతో ఆమెపై ఓ రేంజ్ లో పుకార్లు నడిచాయి. ఆమె తల్లి కాబోతోందంటూ కొందరు పుకార్లు సృష్టిస్తే.. ఆమెకు సరైన ఆఫర్లు రావడం లేదంటూ మరికొందరు రాసుకొచ్చారు. ఎట్టకేలకు ఈ పుకార్లకు చెక్ పెడుతూ కొత్త సినిమా ప్రకటించింది సమంత.

అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాకు ఓకే చెప్పంది ఈ అక్కినేని కోడలు. తాప్సి హీరోయిన్ గా వచ్చిన గేమ్ ఓవర్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అశ్విన్. ఆ సినిమాను క్రిటిక్స్ బాగా మెచ్చుకున్నారు. ఇప్పుడు సమంత లీడ్ రోల్ గా మరో కథ రాసుకున్నాడు. ఆ కథ సమంతకు నచ్చింది.

ప్రస్తుతానికైతే కథ మాత్రమే పూర్తయింది. పూర్తిస్థాయిలో స్క్రీన్ ప్లే రాయాల్సి ఉంది. అది కూడా ఓకే అయితే అప్పుడు ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తారు. సోనీ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

First Published:  13 March 2020 5:03 AM GMT
Next Story