Telugu Global
NEWS

కోడ్ రాకముందే “నిఘా” పెట్టాం... వారి వాదన తప్పు!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రవాహాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిఘా పేరుతో ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండగా.. ఇలాంటి పనులేంటంటూ.. తెలుగుదేశం నాయకులు అభ్యంతరం చెప్పారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. వారికి కౌంటర్ ఇస్తూ.. వైసీపీ నేతలు ఈసీని కలిసి పూర్తి వివరాలు సమర్పించారు. ఎన్నికల కోడ్ రాకముందే యాప్ ను రూపొందించామని.. ఈ విషయాన్ని […]

కోడ్ రాకముందే “నిఘా” పెట్టాం... వారి వాదన తప్పు!
X

స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రవాహాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిఘా పేరుతో ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండగా.. ఇలాంటి పనులేంటంటూ.. తెలుగుదేశం నాయకులు అభ్యంతరం చెప్పారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. వారికి కౌంటర్ ఇస్తూ.. వైసీపీ నేతలు ఈసీని కలిసి పూర్తి వివరాలు సమర్పించారు.

ఎన్నికల కోడ్ రాకముందే యాప్ ను రూపొందించామని.. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేశామని కూడా వైసీపీ నేతలు ఈసీకి గుర్తు చేశారు. సామాన్యులు కూడా నిఘా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని.. అక్రమాలు జరిగిన చోట నేరుగా యాప్ లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. డబ్బు, మద్యం పంపిణీ అడ్డుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని.. ఆ దిశగా ఈ యాప్ లో ఫిర్యాదులు వస్తే.. ఏ పార్టీ వారైనా సరే.. కఠిన చర్యలు తప్పవని ఈసీకి నేతలు చెప్పారు.

తర్వాత.. టీడీపీ తీరుపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఏ రాష్ట్రంలోనైనా సరే… ప్రతిపక్షాలే ఇలాంటి నిఘా కావాలని అడుగుతుంటాయని.. కానీ వీళ్లు మాత్రం రివర్స్ లో ఉన్నారని విమర్శించారు. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వమే మందుకు వచ్చి చర్యలు తీసుకుంటున్నప్పుడు.. సహకరించాల్సింది పోయి.. ఇలా అడ్డుపడితే ఎలా అని నిలదీస్తున్నారు. టీడీపీ నేతల తీరును ప్రజలు గుర్తించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.

పల్నాడు పరిధిలోని మాచర్ల గొడవ విషయంలోనూ టీడీపీ వాదనను వైసీపీ నేతలు తప్పుబట్టారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న చోట.. ఎక్కువ కార్లతో వెళ్లడమే కాక.. ఓ చిన్నారిని ఢీ కొట్టి నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకే.. అక్కడి ప్రజలు అంత ఆగ్రహంగా ప్రవర్తించారని చెప్పారు.

First Published:  12 March 2020 9:32 PM GMT
Next Story