Telugu Global
NEWS

భారత్-సౌతాఫ్రికా తొలివన్డేకి వానగండం

సచిన్ ప్రపంచ రికార్డు వైపు కొహ్లీ చూపు భారత క్రికెట్ నెలవారీ సంతలో భాగంగా మరో సిరీస్ కు రంగం సిద్ధమయ్యింది న్యూజిలాండ్ లో నెలరోజులపాటు పర్యటించి..మూడుఫార్మాట్ల సిరీస్ లో చావుదెబ్బలు తినివచ్చిన భారతజట్టు…సౌతాఫ్రికాతో స్వదేశీ వన్డే సిరీస్ కు సై అంటోంది. హిమగిరి శిఖరం పాదాల చెంతనే ఉన్న అందాల ధర్మశాల స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన తొలివన్డేను వరుణదేవుడు భయపెడుతున్నాడు. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత్, క్వింటన్ డీ కాక్ కెప్టెన్సీలోని సఫారీటీమ్ ఇప్పటికే ధర్మశాల […]

భారత్-సౌతాఫ్రికా తొలివన్డేకి వానగండం
X
  • సచిన్ ప్రపంచ రికార్డు వైపు కొహ్లీ చూపు

భారత క్రికెట్ నెలవారీ సంతలో భాగంగా మరో సిరీస్ కు రంగం సిద్ధమయ్యింది న్యూజిలాండ్ లో నెలరోజులపాటు పర్యటించి..మూడుఫార్మాట్ల సిరీస్ లో చావుదెబ్బలు తినివచ్చిన భారతజట్టు…సౌతాఫ్రికాతో స్వదేశీ వన్డే సిరీస్ కు సై అంటోంది.

హిమగిరి శిఖరం పాదాల చెంతనే ఉన్న అందాల ధర్మశాల స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన తొలివన్డేను వరుణదేవుడు భయపెడుతున్నాడు.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత్, క్వింటన్ డీ కాక్ కెప్టెన్సీలోని సఫారీటీమ్ ఇప్పటికే ధర్మశాల చేరుకొని ముమ్మర నెట్ ప్రాక్టీస్ తో తొలి సమరానికి సై అంటే సై అంటున్నాయి.

సఫారీల జోరు, భారత్ టెన్షన్ టెన్షన్…

ఆస్ట్ర్రేలియాతో కొద్దిరోజుల క్రితమే ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన జోరుతో సఫారీటీమ్ ఉంటే… న్యూజిలాండ్ తో ముగిసిన సిరీస్ లో 3-0తో చిత్తుగా ఓడిన విరాట్ సేన ఏదో తెలియని ఓత్తిడితో బరిలోకి దిగుతోంది.

గత కొద్దివారాలుగా గాయాలతో జట్టుకు దూరమైన హార్థిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ తిరిగి అందుబాటులోకి రావడంతో కొత్తఊపిరిపోసుకొంది.

డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ లేని లోటును రాహుల్ పూడ్చే అవకాశాలున్నాయి.

విరాట్ వైపే అందరి చూపు…

న్యూజిలాండ్ టూర్ గత ఐదు అంతర్జాతీయ మ్యాచ్ ల్లో కేవలం 75 పరుగులు మాత్రమే సాధించిన భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ.. తిరిగి తనదైనశైలిలో భారీస్కోర్ల మోత మోగించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

వన్డే క్రికెట్లో ఇప్పటికే 42 వన్డే సెంచరీలు బాదిన కొహ్లీ…మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న రికార్డును సైతం అధిగమించాలన్న లక్ష్యంతో సిద్ధమయ్యాడు. వన్డే క్రికెట్లో సచిన్ 300 ఇన్నింగ్స్ లో 12వేల పరుగుల మైలురాయిని చేరిన ప్రపంచ రికార్డు సాధిస్తే…ప్రస్తుత సిరీస్ ద్వారా…విరాట్ కొహ్లీ ఆ రికార్డును అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుత మూడు వన్డేలలో కొహ్లీ మరో 133 పరుగులు సాధించగలిగితే వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12వేల పరుగులు సాధించిన క్రికెటర్ గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన వాడవుతాడు.

న్యూజిలాండ్ తో ఆడిన గత మూడు వన్డేలలో 51, 15, 9 స్కోర్లు మాత్రమే సాధించిన కొహ్లీ ప్రస్తుత సిరీస్ ద్వారా భారీస్కోరుకు గురిపెట్టాడు. ఇప్పటి వరకూ ఆడిన 239 ఇన్నింగ్స్ లోనే 11 వేల 867 పరుగులు సాధించిన కొహ్లీ..వచ్చే మూడు ఇన్నింగ్స్ లోనూ కలసి 133 పరుగులు సాధిస్తే…అది సరికొత్త ప్రపంచ రికార్డే అవుతుంది.

పవర్ ఫుల్ బ్యాటింగ్ తో సౌతాఫ్రికా..

క్వింటన్ డీ కాక్, వాన్ డ్యూసెన్, ఫాబ్ డూప్లెసిస్, మలన్ లాంటి ఆటగాళ్లతో సఫారీబ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఫేస్ టు పేస్ రికార్డుల్లో భారత్ కంటే ఎక్కువ విజయాలు సాధించిన సౌతాఫ్రికా స్థాయికి తగ్గట్టుగా ఆడితే..ఆతిథ్య భారత్ కు గట్టిపోటీ తప్పదు. వరుణుడు కరుణిస్తే మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

First Published:  11 March 2020 9:00 PM GMT
Next Story