Telugu Global
NEWS

బాబు మార్కు రాజకీయానికి తాజాగా వర్ల రామయ్య బలి

దేశంలో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నా.. చంద్రబాబు చేసే రాజకీయాలు ఎవరూ చేయలేరేమో. కూరలో కరేపాకులా ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో బాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆనాటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచి తాజాగా వర్ల రామయ్య వరకు అందరూ బలి పశువులే. గెలవలేమని తెలిసి దళితుడైన వర్ల రామయ్యను రాజ్యసభ బరిలో నిలపడం బాబు వికృత రాజకీయానికి పరాకాష్ట. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే వైసీపీ తమకున్న బలం వల్ల […]

బాబు మార్కు రాజకీయానికి తాజాగా వర్ల రామయ్య బలి
X

దేశంలో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నా.. చంద్రబాబు చేసే రాజకీయాలు ఎవరూ చేయలేరేమో. కూరలో కరేపాకులా ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో బాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆనాటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచి తాజాగా వర్ల రామయ్య వరకు అందరూ బలి పశువులే. గెలవలేమని తెలిసి దళితుడైన వర్ల రామయ్యను రాజ్యసభ బరిలో నిలపడం బాబు వికృత రాజకీయానికి పరాకాష్ట.

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే వైసీపీ తమకున్న బలం వల్ల నలుగురిని నిలబెట్టింది. ఒక ఎంపీ గెలవడానికి 41 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. అలా చూస్తే వైసీపీకి కూడా నాలుగో అభ్యర్థికి ఓట్లు తగ్గుతాయి. కాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల సహాయంతో ఈజీగా ఆ స్థానాన్ని గెలుచుకోవచ్చు. మరి 23 మంది ఎమ్మెల్యేలే ఉన్న టీడీపీ తరపున వర్ల రామయ్యను నిలబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ కచ్చితంగా గెలిచే స్థానమైతే చంద్రబాబు ఇలా ఎస్సీలకు ఆ సీటు ఇచ్చేవాడా అని పలువురు ప్రశ్నిస్తున్నాడు. కేవలం రాజకీయ పావుగా వాడుకోవడానికే దళితుడైన వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టినట్లు తెలుస్తోంది. గతంలోనే వర్ల రామయ్యను ఎస్సీ కోటాలో రాజ్యసభకు పంపుతానని మీడియాకు లీకులు ఇచ్చారు. స్వయంగా వర్ల రామయ్యకు ఫోన్ చేసి నీకు సీటు కన్ఫార్మ్ అని కూడా చెప్పాడు. వర్ల రామయ్య ఫ్యామిలీతో కలసి బాబు దగ్గరకు ప్రయాణమైన వేళ చావు కబురు చల్లగా చెప్పారు. సీటు నీకు ఇవ్వలేకపోతున్నాం.. ఆ సీటు సీఎం రమేష్‌కి ఇస్తున్నామని. అప్పటికే ప్రకాశం బ్యారేజి మీద ఉన్న వర్ల రామయ్య విషాదంగా ఇంటికి వెనుదిరిగారు.

బాబు వర్ల రామయ్యతోనే కాక గతంలో ఎంతో మందితో ఇలా ఆడుకున్నాడు. జూపూడి ప్రభాకరరావుకు కూడా ఎమ్మెల్సీ ఇస్తానని చివరి నిమిషంలో ఏదో సాకు పెట్టి ఎగ్గొట్టాడు. ముఖ్యంగా దళితుల విషయంలోనే ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేశాడు. పుష్ఫరాజ్, మోత్కుపల్లిని పదవుల విషయంలో ఎలాంటి హామీలు ఇచ్చి తుంగలో తొక్కాడో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తెలిసిన అందరికీ తెలుసు. తాజాగా వర్ల రామయ్యను పావుగా వాడుకొని సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపాడు.

గెలవని సీటుకు వర్ల రామయ్యను అభ్యర్థిగా చేసి వైసీపీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. నత్వానీ వంటి పరాయి రాష్ట్రం వారికి మీరు ఓటేస్తారా అని ప్రశ్నిస్తున్నాడు. మరి ఇదే చంద్రబాబు ఒకానొకప్పుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో రాసుకపూసుకొని తిరగలేదా..? ఏపీలో గ్యాస్ నిక్షేపాలు వెలికితీస్తున్న, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కంపెనీ యజమాని అడిగితే సీఎం జగన్ ఆ కోరికను మన్నించడం తప్పా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు ఇక మీదటైనా ఇలాంటి చవుకబారు రాజకీయాలు మానుకొని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే రాజకీయాలు చేయాలని పలువురు కోరుకుంటున్నారు.

First Published:  11 March 2020 1:16 AM GMT
Next Story