Telugu Global
NEWS

ఒలింపిక్స్ కు 8 మంది భారత బాక్సర్ల అర్హత

సెమీఫైనల్లోనే మేరీ కోమ్ పరాజయం జోర్డాన్ రాజధాని అమ్మాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ -ఆసియా అర్హత బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలలో భారత బాక్సింగ్ జట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణించింది. టోక్యో వేదికగా జరిగే 2020 ఒలింపిక్స్ కు వెటరన్ మేరీ కోమ్ తో సహా మొత్తం ఎనిమిదిమంది భారత బాక్సర్లు అర్హత సంపాదించారు. పురుషుల, మహిళల..మొత్తం ఎనిమిది విభాగాలలో భారత బాక్సర్లు మేరీ కోమ్, వికాస్ కృష్ణన్, అమిత్ పంగల్, పూజా రాణీ, లవ్లీనా బోర్గెయిన్, అశీశ్ […]

ఒలింపిక్స్ కు 8 మంది భారత బాక్సర్ల అర్హత
X
  • సెమీఫైనల్లోనే మేరీ కోమ్ పరాజయం

జోర్డాన్ రాజధాని అమ్మాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ -ఆసియా అర్హత బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలలో భారత బాక్సింగ్ జట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణించింది. టోక్యో వేదికగా జరిగే 2020 ఒలింపిక్స్ కు వెటరన్ మేరీ కోమ్ తో సహా మొత్తం ఎనిమిదిమంది భారత బాక్సర్లు అర్హత సంపాదించారు.

పురుషుల, మహిళల..మొత్తం ఎనిమిది విభాగాలలో భారత బాక్సర్లు మేరీ కోమ్, వికాస్ కృష్ణన్, అమిత్ పంగల్, పూజా రాణీ, లవ్లీనా బోర్గెయిన్, అశీశ్ కుమార్, సతీష్ కుమార్ లు మెడల్ రౌండ్ చేరడం ద్వారా ఒలింపిక్స్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నారు.

పురుషుల 69 కిలోల విభాగంలో అమిత్ పంగల్, మహిళల 75 కిలోల విభాగంలో పూజా రాణి, 51 కిలోల విభాగంలో మేరీ కోమ్, పురుషుల 75 కిలోల విభాగంలో లవ్లీనా,అశీష్ క్వార్టర్ ఫైనల్స్ విజయాలు సాధించినా…సెమీస్ పరాజయాలతో చివరకు కాంస్య పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

లవ్లీన్, పూజా రాణి ఒలింపిక్స్ కు తొలిసారిగా అర్హత సంపాదించగా…వికాస్ కృష్ణన్ తన కెరియర్ లో మూడోసారి ఒలింపిక్స్ బెర్త్ సంపాదించడం విశేషం. అమిత్ పంగల్, పురుషుల 91 కిలోల విభాగంలో సతీష్ కుమార్ సెమీస్ పరాజయాలతో కాంస్య పతకాలు సాధించారు.

భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ మహిళల 51 కిలోల విభాగంలో సెమీస్ చేరడం ద్వాా వరుసగా రెండోసారి ఒలింపిక్స్ కు అర్హత సంపాదించింది.

పురుషుల 69 కిలోల విభాగంలో వికాస్ కృష్ణన్, మహిళల 60 కిలోల విభాగంలో సిమ్రన్ జీత్ కౌర్ ఫైనల్స్ చేరడం ద్వారా రజత పతకాలు ఖాయం చేసుకోగలిగారు.

First Published:  10 March 2020 8:55 PM GMT
Next Story