Telugu Global
National

జ‌గ‌న్ బాటలోనే మ‌రో రాష్ట్రం !

ఉత్త‌రాఖండ్‌కు 3 రాజ‌ధానులు ఏపీ సీఎం జ‌గ‌న్ బాట‌లోనే మ‌రో రాష్ట్రం అడుగు వేసింది. ఉత్త‌రాఖండ్‌కు మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయ‌బోతుంది. ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గైర్సైన్ ఎంపిక చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అ సెంబ్లీలో ప్ర‌క‌టించారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ఇప్ప‌టికే డెహ్రాడూన్ కొన‌సాగుతోంది. జ్యుడీషియల్ రాజధానిగా నైనితాల్ ఉండ‌బోతుంది. గైర్సైన్‌ను శాశ్వత రాజధానిగా చేయాలని పర్వతప్రాంత ప్రజల చాలా రోజుల నుండి డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉత్తరాఖండ్ సీం ఈ […]

జ‌గ‌న్ బాటలోనే మ‌రో రాష్ట్రం !
X
  • ఉత్త‌రాఖండ్‌కు 3 రాజ‌ధానులు

ఏపీ సీఎం జ‌గ‌న్ బాట‌లోనే మ‌రో రాష్ట్రం అడుగు వేసింది. ఉత్త‌రాఖండ్‌కు మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయ‌బోతుంది. ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గైర్సైన్ ఎంపిక చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అ సెంబ్లీలో ప్ర‌క‌టించారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ఇప్ప‌టికే డెహ్రాడూన్ కొన‌సాగుతోంది. జ్యుడీషియల్ రాజధానిగా నైనితాల్ ఉండ‌బోతుంది.

గైర్సైన్‌ను శాశ్వత రాజధానిగా చేయాలని పర్వతప్రాంత ప్రజల చాలా రోజుల నుండి డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉత్తరాఖండ్ సీం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. గైర్సైన్‌లో కొత్త అసెంబ్లీ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ‌బోతుంది. అధికారుల నివాస భవనాలు సహా… నిర్మాణ దశలో పలు భవనాలు ఇప్ప‌టికే ఉన్నాయి. గైర్సైన్ సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేప‌ట్టింది.

ఉత్త‌రాఖండ్ కూడా ఏపీ బాట‌లో న‌డుస్తోంది. దీంతో జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌కు మ‌రింత బ‌లం చేకూరింది. ఇప్ప‌టికే కర్నాట‌క లో పాల‌న వికేంద్రీక‌ర‌ణ జ‌రిగింది. ఇప్పుడు ఉత్త‌రాఖండ్‌ అదే బాట ప‌ట్టింది. అమ‌రావ‌తి ఉద్యమం 78 రోజులు దాటింది. కానీ ఆ మూడు గ్రామాలు దాటి ఉద్య‌మం ఒక్క అడుగు ముందుకు ప‌డ‌లేదు. మరోవైపు జ‌గ‌న్ నిర్ణ‌యానికి రొజురోజుకూ మద్ధతు పెరుగుతోంది. జూన్ నాటికి విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్ ఏర్పాటు దిశ‌గా స‌ర్కార్ అడుగులు వేస్తోంది.

First Published:  4 March 2020 9:02 PM GMT
Next Story