Telugu Global
NEWS

ఇంట్రెస్టింగ్: జగన్ సర్కార్ పొలిటికల్ థ్రిల్లర్.. టార్గెట్ ఫోర్!

ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజులు.. రాజకీయంగా వేసవిని మించిన వేడిని రగిలించనున్నాయి. వైఎస్ జగన్ సర్కారు తీసుకోబోతున్న చర్యలు.. వాటి ఫలితంగా ఎదురు కానున్న పరిణామాలు.. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాలు.. అన్నీ ఓ వరుసలో పరిశీలిస్తే.. ఓ పొలిటికల్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. ఆ వివరాలపై.. ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. అధికార పార్టీ చర్యలకు, ప్రతిపక్షం ప్రతి చర్యలు ఎలా ఉంటాయన్నదే ఆసక్తికరంగా మారింది. అసలు విషయానికి వస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలకు జగన్ ప్రభుత్వం […]

ఇంట్రెస్టింగ్: జగన్ సర్కార్ పొలిటికల్ థ్రిల్లర్.. టార్గెట్ ఫోర్!
X

ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజులు.. రాజకీయంగా వేసవిని మించిన వేడిని రగిలించనున్నాయి. వైఎస్ జగన్ సర్కారు తీసుకోబోతున్న చర్యలు.. వాటి ఫలితంగా ఎదురు కానున్న పరిణామాలు.. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాలు.. అన్నీ ఓ వరుసలో పరిశీలిస్తే.. ఓ పొలిటికల్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. ఆ వివరాలపై.. ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. అధికార పార్టీ చర్యలకు, ప్రతిపక్షం ప్రతి చర్యలు ఎలా ఉంటాయన్నదే ఆసక్తికరంగా మారింది.

అసలు విషయానికి వస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. నెల రోజుల్లోనే పని పూర్తి చేయాలన్న ఆదేశాలు అధికారులకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి నుంచే వెళ్లాయి. ఈ పని పూర్తయ్యే లోపు ఏప్రిల్ వచ్చేస్తుంది. ఆ లోపు ఉగాది పండగ కూడా వస్తుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఉగాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసేయాలని సీఎం జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు.

ఈ రెండు వ్యవహారాల మధ్యలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా.. ఈ సారి కేటాయింపుల్లో సింహ భాగం.. పథకాల అమలుకే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగో విషయానికి వస్తే.. పరిపాలన రాజధానిగా విశాఖకు పూర్తి రూపు సంతరింపజేయడం. ఇప్పటికే.. ఉద్యోగ సంఘాలకు ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు వెళ్లాయని లీకులు వస్తున్నాయి. మే నాటికి.. విశాఖలో పాలన మొదలయ్యే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు, ఉగాదికి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, విశాఖకు పరిపాలన రాజధాని మార్పు. ఇలా.. 4 టార్గెట్లను పెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. అనుకున్న సమయానికి అనుకున్న పని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ దూకుడును ప్రతిపక్ష టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది అన్న విషయంపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ వేసవిలో సీరియస్ పొలిటికల్ ఫైట్ ఖాయమన్న అంచనాలు పెరుగుతున్నాయి.

First Published:  3 March 2020 7:52 PM GMT
Next Story