Telugu Global
NEWS

లోకేష్ విందు రాజ‌కీయంపై తమ్ముళ్ల ఫైర్‌

అనుకున్న‌ది ఒక‌టి..అయ్యిందొక‌టి. టీడీపీ వార‌సుల‌తో మీటింగ్ పెట్టి… ఫొటోలు రీలీజ్ చేస్తే మైలేజీ వ‌స్తుంద‌ని ఆశిస్తే….రివ‌ర్స్ లో పంచ్‌లు పడుతున్నాయి. నారా లోకేష్ నీ ప్లాన్‌లు ఏం బాగా లేవంటూ తెలుగు త‌మ్ముళ్లు మండిప‌డుతున్నారు. తెలుగుదేశం యువ లీడర్లు మొత్తం హైదరాబాదులోని నారా లోకేష్ ఇంట్లో సమావేశం అయ్యారు. శ్రీకాళం యువ నేత రామ్మోహన్ నాయుడు మొదలుకుని… అనంతపురం యువ నేత జేసీ కుమారుడు పవన్ వరకు… దాదాపు అందరు నేతలు కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. […]

లోకేష్ విందు రాజ‌కీయంపై తమ్ముళ్ల ఫైర్‌
X

అనుకున్న‌ది ఒక‌టి..అయ్యిందొక‌టి. టీడీపీ వార‌సుల‌తో మీటింగ్ పెట్టి… ఫొటోలు రీలీజ్ చేస్తే మైలేజీ వ‌స్తుంద‌ని ఆశిస్తే….రివ‌ర్స్ లో పంచ్‌లు పడుతున్నాయి.

నారా లోకేష్ నీ ప్లాన్‌లు ఏం బాగా లేవంటూ తెలుగు త‌మ్ముళ్లు మండిప‌డుతున్నారు. తెలుగుదేశం యువ లీడర్లు మొత్తం హైదరాబాదులోని నారా లోకేష్ ఇంట్లో సమావేశం అయ్యారు. శ్రీకాళం యువ నేత రామ్మోహన్ నాయుడు మొదలుకుని… అనంతపురం యువ నేత జేసీ కుమారుడు పవన్ వరకు… దాదాపు అందరు నేతలు కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు.

ఈ మీటింగ్‌పై కార్య‌క‌ర్త‌లు పంచ్‌లు విసిరారు. వీరిలో న‌లుగురు మాత్ర‌మే యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నార‌ని…మిగ‌తావారు ఎవరూ యాక్టివ్‌గా లేర‌ని…వీరితో పార్టీకి లాభం లేద‌ని కొంద‌రు కామెంట్స్ చేశారు. ఇలాంటి నేత‌ల‌తో మీటింగ్‌లు బ‌ద‌లు… గ్రౌండ్ లెవ‌ల్లో పార్టీ కోసం ప‌నిచేసే కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు పెడితే పార్టీలో జోష్ వ‌స్తుంద‌ని కొందరు దెప్పిపొడుస్తున్నారు.

ఇన్నాళ్లు వీళ్ల తండ్రులను గెలిపించాం…ఇప్పుడు వీరిని గెలిపించాలా? వేరే నేత‌లు పార్టీలో పైకి రావొద్దా? లోకేష్ ఏం సందేశం ఇస్తున్నార‌ని మ‌రికొంద‌రు విమ‌ర్శించారు. మొత్తానికి మీటింగ్ ప‌ట్టి మైలేజీ సాధిస్తామ‌ని చిన‌బాబు ఆశిస్తే…ఆయ‌నకు మాత్రం రివ‌ర్స్‌లో పంచ్‌లు ప‌డుతున్నాయి. కొత్తింట్లో తొలి మీటింగ్ రివ‌ర్స్ కొట్టింది. దీంతో లోకేష్ మీటింగ్‌పై చంద్ర‌బాబు కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. ఇలాంటి మీటింగ్‌లు ఇంట్లో పెట్టొద్ద‌ని అన్న‌ట్లు స‌మాచారం.

First Published:  2 March 2020 9:45 PM GMT
Next Story