Telugu Global
National

అంబానీకి నో చెప్పిన జగన్... కారణమేంటి?

అపర కుబేరుడు.. ప్రపంచంలోనే 9వ అత్యంత సంపన్నుడు. దేశంలోనే నంబర్ 1 ఆస్తిపరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. అలాంటి అంబానీ ప్రస్తుతం దేశ రాజకీయాలనే శాసించే స్థితిలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ఉన్నా.. కాంగ్రెస్ ఉన్నా అంబానీ చక్రం తిప్పగలరన్న వాదన ఉంది. అయితే దేశాన్ని శాసించగల అలాంటి ముఖేష్ అంబానీ కోరితే ఏ రాజకీయ పార్టీ అయినా కాదనకుండా ఉంటుందా? కానీ ఏపీ సీఎం, వైసీపీ అధినేత ఇంటికి వచ్చి కలిసినా ముఖేష్ […]

అంబానీకి నో చెప్పిన జగన్... కారణమేంటి?
X

అపర కుబేరుడు.. ప్రపంచంలోనే 9వ అత్యంత సంపన్నుడు. దేశంలోనే నంబర్ 1 ఆస్తిపరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. అలాంటి అంబానీ ప్రస్తుతం దేశ రాజకీయాలనే శాసించే స్థితిలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ఉన్నా.. కాంగ్రెస్ ఉన్నా అంబానీ చక్రం తిప్పగలరన్న వాదన ఉంది.

అయితే దేశాన్ని శాసించగల అలాంటి ముఖేష్ అంబానీ కోరితే ఏ రాజకీయ పార్టీ అయినా కాదనకుండా ఉంటుందా? కానీ ఏపీ సీఎం, వైసీపీ అధినేత ఇంటికి వచ్చి కలిసినా ముఖేష్ అంబానీ కోరిక తీర్చలేదు. ఆయన ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టినట్టు తెలిసింది.

ముఖేష్ అంబానీతోపాటు ఆయన కుమారుడు , రాజ్యసభ ఎంపీ పరిమల్ నాథ్వానీ ఇటీవల జగన్ ను కలవడానికి ఏపీకి వచ్చారు. ఏప్రిల్ లో ఖాళీ కాబోయే రాజ్యసభ సీట్లలో నాలుగు వైసీపీ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పరిమల్ నాథ్వానీని ఏపీ కోటాలో వైసీపీ తరుఫున రాజ్యసభకు పంపడానికి నామినేట్ చేయాలని సీఎం జగన్ ను కోరడానికే ముఖేష్ అంబానీ వచ్చినట్టు ప్రచారం జరిగింది.

రిలయన్స్ సంస్థలో టాప్ మేనేజ్ మెంట్ నాథ్వానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. గత రెండుసార్లు జార్ఖండ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ జార్ఖండ్ లో దారుణంగా ఓడిపోవడంతో ఈసారి అక్కడి నుంచి నాథ్వానీ రాజ్యసభకు వెళ్లడం కష్టం. అందుకే ముకేష్ అంబానీయే కదిలివచ్చి సీఎం జగన్ ను ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం సాగుతోంది.

అయితే ఈ ప్రతిపాదనను జగన్ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఏపీలో అధికారంలోకి తొలిసారి వచ్చామని.. ఇలా నమ్ముకున్న నేతలను కాదని.. వేరొకరికి ఇస్తే అమ్ముకున్నట్టు ప్రత్యర్థులు ప్రచారం చేస్తారని.. రాజకీయంగా తమకు నష్టమని తమ వారికే సీట్లు ఇస్తామని జగన్ చెప్పినట్టు సమాచారం. ఎంత పెద్ద వ్యక్తులు, శక్తులు అడిగినా… నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి సీఎం జగన్ ఏకంగా ముకేష్ అంబానీకి నో చెప్పినట్లు తెలియడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

First Published:  3 March 2020 2:22 AM GMT
Next Story