Telugu Global
Cinema & Entertainment

శ్యామ్ సింగరాయ్ స్టోరీ ఇదే

రీసెంట్ గా తన కొత్త సినిమా ప్రకటించాడు నాని. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు నేచురల్ స్టార్. ఇప్పుడీ స్టోరీలైన్ కొద్దిగా బయటకొచ్చింది. రాహుల్ సంకృత్యాన్ కథలన్నీ కొత్తగా ఉంటాయి. శ్యామ్ సింగరాయ్ కథ కూడా అలాంటిదే. ఇందులో పునర్జన్మల కాన్సెప్ట్ ను టచ్ చేశాడు రాహుల్. సినిమాలో రెండు ప్రేమకథలుంటాయి. ఒకటి హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో, ఇంకోటి కోల్ […]

శ్యామ్ సింగరాయ్ స్టోరీ ఇదే
X

రీసెంట్ గా తన కొత్త సినిమా ప్రకటించాడు నాని. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు నేచురల్ స్టార్. ఇప్పుడీ స్టోరీలైన్ కొద్దిగా బయటకొచ్చింది.

రాహుల్ సంకృత్యాన్ కథలన్నీ కొత్తగా ఉంటాయి. శ్యామ్ సింగరాయ్ కథ కూడా అలాంటిదే. ఇందులో పునర్జన్మల కాన్సెప్ట్ ను టచ్ చేశాడు రాహుల్. సినిమాలో రెండు ప్రేమకథలుంటాయి. ఒకటి హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో, ఇంకోటి కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ రెండు కథలకు సంబంధంలేని మూడో పాత్ర ఒకటి ఉంటుంది. ఇలా ఈ 3 అంశాల మధ్య ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది.

సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ హీరోయిన్లు, టెక్నీషియన్లు ఎవరనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టుకు తమన్ సంగీతం అందించే అవకాశం ఉంది. డిసెంబర్ 25న శ్యామ్ సింగరాయ్ ను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.

First Published:  2 March 2020 12:00 AM GMT
Next Story