Telugu Global
Cinema & Entertainment

కొరటాలకు సారీ చెప్పిన చిరంజీవి

తన దర్శకుడు కొరటాల శివకు సారీ చెప్పారు చిరంజీవి. ఓ పిట్టకథ సినిమా ఫంక్షన్ లో ఈ ఘటన జరిగింది. ఇంతకీ చిరంజీవి లాంటి వ్యక్తి కొరటాలకు ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ మూవీకి ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ఓ మంచి సందర్భం చూసి ఆ టైటిల్ ను గ్రాండ్ గా ప్రకటించాలని అనుకున్నారు. అలా సినిమాకు భారీగా పబ్లిసిటీ ఇవ్వాలనుకున్నారు. కానీ అంతలోనే చిరంజీవి […]

కొరటాలకు సారీ చెప్పిన చిరంజీవి
X

తన దర్శకుడు కొరటాల శివకు సారీ చెప్పారు చిరంజీవి. ఓ పిట్టకథ సినిమా ఫంక్షన్ లో ఈ ఘటన జరిగింది. ఇంతకీ చిరంజీవి లాంటి వ్యక్తి కొరటాలకు ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ మూవీకి ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ఓ మంచి సందర్భం చూసి ఆ టైటిల్ ను గ్రాండ్ గా ప్రకటించాలని అనుకున్నారు. అలా సినిమాకు భారీగా పబ్లిసిటీ ఇవ్వాలనుకున్నారు. కానీ అంతలోనే చిరంజీవి ఆ టైటిల్ చెప్పేశారు.

తన సినిమాకు ఆచార్య అనే టైటిల్ పెట్టినట్టు ప్రకటించేశారు చిరంజీవి. ఆ తర్వాత వెంటనే నాలుక కరుచుకున్నారు. యూనిట్ ప్రకటించకుండా తను చెప్పేశానని క్షమించాలంటూ కొరటాలకు సభాముఖంగా సారీ చెప్పారు. మొత్తానికి చిరు ప్రకటనతో టైటిల్ పై క్లారిటీ వచ్చేసింది.

First Published:  2 March 2020 12:01 AM GMT
Next Story