Telugu Global
NEWS

మళ్లీ బరితెగించిన కూన రవి.... అధికారికి ఫోన్‌లో బెదిరింపులు

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస టీడీపీ నేత కూన రవికుమార్‌ బెదిరింపుల పంచాయితీ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్‌ చేసి బండ బతూలు తిట్టి మరోసారి వివాదానికి కారణమయ్యాడు. కొన్ని పనులకు సంబంధించి తన మనుషులకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఓ అధికారికి ఫోన్‌ చేసి పచ్చి బూతులు తిట్టాడు కూన రవికుమార్‌. ఇప్పుడా ఫోన్‌ కాల్‌ ఆడియో టేప్ వైరల్‌ అయింది. సరుబుజ్జిలి మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఈవో పీఆర్‌డీగా పని చేస్తున్న వెంకట […]

మళ్లీ బరితెగించిన కూన రవి.... అధికారికి ఫోన్‌లో బెదిరింపులు
X

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస టీడీపీ నేత కూన రవికుమార్‌ బెదిరింపుల పంచాయితీ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్‌ చేసి బండ బతూలు తిట్టి మరోసారి వివాదానికి కారణమయ్యాడు. కొన్ని పనులకు సంబంధించి తన మనుషులకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఓ అధికారికి ఫోన్‌ చేసి పచ్చి బూతులు తిట్టాడు కూన రవికుమార్‌. ఇప్పుడా ఫోన్‌ కాల్‌ ఆడియో టేప్ వైరల్‌ అయింది.

సరుబుజ్జిలి మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఈవో పీఆర్‌డీగా పని చేస్తున్న వెంకట అప్పలనాయుడుతో ఫోన్‌లో మాట్లాడిన కూన రవికుమార్‌… తన మనుషులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని నిలదీశాడు. దాంతోపాటు తాను ఫోన్‌ చేస్తే ఎందుకు తీయలేదంటూ తన దైన స్టయిల్‌లో బూతులందుకున్నాడు కూన రవికుమార్‌. ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చి గొయ్యిలో పాతేస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. విశాఖలో ఉన్నా సరే… ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లిపోతానని కూన రవికుమార్‌ హెచ్చరించాడు.

ఈ ఆడియో బయటకు వచ్చిన తర్వాత… కూన రవికుమార్‌కు అనుకూలంగా ఉన్న కొంతమంది ఈవో పీఆర్‌డీకి ఫోన్‌ చేశారు. ఈవో పీఆర్‌డీకి కూడా వాళ్లు తెలిసిన వాళ్లే. కూన రవికుమార్‌ ఏదో ఆవేశంలో అలా అన్నాడని… అవేవీ పట్టించుకోవద్దని, ఇష్యూను సెటిల్‌ చేసుకుందామని… నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఆడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది.

కూన రవి బెదిరింపులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈవోపీఆర్‌డీ అప్పలనాయుడు. గతంలో విప్‌గా ఉన్నప్పుడూ నీచాతినీచంగా మాట్లాడే వాడని చెబుతున్నాడు. ఇప్పుడు తనకు భద్రత కల్పించకపోతే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటున్నాడు.

ఇప్పుడే కాదు… గతంలోనూ కూన రవికుమార్‌ బూతుల పంచాయితీ నడిచింది. సరుబుజ్జిలి ఎంపీడీవో ఆఫీస్‌కు వెళ్లి అధికారులను బెదిరించాడు. ఆ కేసులో అజ్ఞాతంలోకి వెళ్లారాయన. నెల రోజుల తర్వాత బయటకొచ్చి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయన తీరు మారకపోవడంపై అధికారులు, సిబ్బంది నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ఆడియోలు ఇంకెన్ని పరిణామాలకు దారితీస్తాయోనన్న చర్చ ఆముదాలవలస నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది.

First Published:  2 March 2020 2:22 AM GMT
Next Story