Telugu Global
NEWS

చంద్రబాబుపై చెప్పులు.... పవన్ విశాఖ టూర్ వాయిదా?

అమరావతికి మద్దతిస్తూ మూడు రాజధానులను వ్యతిరేకించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖపట్నంలో ఎదురుదెబ్బ తగిలింది. నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన చందంగా చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటలు ప్లస్ అదనంగా చెప్పులు కూడా పడ్డాయి. విశాఖను రాజధానిగా ఒప్పుకోని బాబును తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకే పవన్ కళ్యాణ్ తాజాగా సర్దుకున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లా నేతల సమీక్షను హైదరాబాద్ లో నిర్వహించిన పవన్… ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉండడంతో విశాఖపట్నంలో నిర్వహించే ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశానికి డుమ్మా […]

చంద్రబాబుపై చెప్పులు.... పవన్ విశాఖ టూర్ వాయిదా?
X

అమరావతికి మద్దతిస్తూ మూడు రాజధానులను వ్యతిరేకించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖపట్నంలో ఎదురుదెబ్బ తగిలింది. నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన చందంగా చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటలు ప్లస్ అదనంగా చెప్పులు కూడా పడ్డాయి. విశాఖను రాజధానిగా ఒప్పుకోని బాబును తీవ్రంగా వ్యతిరేకించారు.

అందుకే పవన్ కళ్యాణ్ తాజాగా సర్దుకున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లా నేతల సమీక్షను హైదరాబాద్ లో నిర్వహించిన పవన్… ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉండడంతో విశాఖపట్నంలో నిర్వహించే ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశానికి డుమ్మా కొట్టాడు.

తన ప్లేసులో జనసేన మరో నేత నాదెండ్ల మనోహర్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. పార్టీ అధినేత పవన్ పాల్గొనకుండా జరుగుతున్న మొదటి సమావేశం ఇదేనట..

చంద్రబాబుకు విశాఖలో అవమానం జరగడం.. పవన్ కూడా అమరావతికి మద్దతు తెలుపడం.. పైగా ఉత్తరాంధ్రలోనే పోయిన ఎన్నికల్లో పోటీచేస్తే తనను ఓడించడంతో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లకుండా డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. బాబుకు పట్టిన గతే తనకు పడుతుందన్న అనుమానంతో…. షూటింగ్ లు చేసుకుంటున్నాడని అంటున్నారు.

First Published:  1 March 2020 1:35 AM GMT
Next Story