Telugu Global
NEWS

దుబాయి మాస్టర్స్ కింగ్ జోకోవిచ్

ప్రపంచ నంబర్ వన్ ఖాతాలో 79వ టైటిల్ ప్రపంచ పురుషుల టెన్నిస్ లో నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ విజయపరంపర కొనసాగుతోంది. 2020 సీజన్లో టాప్ సీడ్ జోకోవిచ్ ఏటీపీ టూర్ తొలి టైటిల్ నెగ్గి…తన కెరియర్ సింగిల్స్ టైటిల్స్ ను 79కు పెంచుకొన్నాడు. ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ ను రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి నెగ్గిన సెర్బియన్ స్టార్ జోకోవిచ్…దుబాయ్ ఓపెన్ ఫైనల్లో గ్రీకువీరుడు టిస్టిస్ పాస్ ను వరుససెట్లలో అధిగమించాడు. జోకోవిచ్ షోగా సాగిన టైటిల్ సమరంలో […]

దుబాయి మాస్టర్స్ కింగ్ జోకోవిచ్
X
  • ప్రపంచ నంబర్ వన్ ఖాతాలో 79వ టైటిల్

ప్రపంచ పురుషుల టెన్నిస్ లో నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ విజయపరంపర కొనసాగుతోంది. 2020 సీజన్లో టాప్ సీడ్ జోకోవిచ్ ఏటీపీ టూర్ తొలి టైటిల్ నెగ్గి…తన కెరియర్ సింగిల్స్ టైటిల్స్ ను 79కు పెంచుకొన్నాడు.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ ను రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి నెగ్గిన సెర్బియన్ స్టార్ జోకోవిచ్…దుబాయ్ ఓపెన్ ఫైనల్లో గ్రీకువీరుడు టిస్టిస్ పాస్ ను వరుససెట్లలో అధిగమించాడు.

జోకోవిచ్ షోగా సాగిన టైటిల్ సమరంలో టిస్టిస్ పాస్ ను 6-3, 6-4తో కంగు తినిపించాడు. 2019 నుంచి జోకోవిచ్ కు 21వ విజయం కాగా… ప్రస్తుత సీజన్లో వరుసగా 18 వ గెలుపు కావడం విశేషం.

32 సంవత్సరాల జోకోవిచ్ కెరియర్ లో వరుసగా 20కి పైగా మ్యాచ్ లు నెగ్గడం ఏడవసారి కాగా…దుబాయ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకోడం ఐదోసారి మాత్రమే.

2020 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ , ఏటీపీ టూర్ కప్ సాధించడం ద్వారా తిరిగి నంబర్ వన్ ర్యాంక్ చేజిక్కించుకొన్న జోకోవిచ్…టూర్ చరిత్రలో 280వ వారాన్ని టాప్ ర్యాంక్ తో కొనసాగించనున్నాడు.

దుబాయ్ ఓపెన్లో 11వసారి పాల్గొన్న జోకోవిచ్ ఆరుసార్లు ఫైనల్స్ చేరడంమే కాదు…ఐదుసార్లు విన్నర్ గా నిలవడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

First Published:  29 Feb 2020 8:02 PM GMT
Next Story