Telugu Global
NEWS

ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో ఆఖరాట

శ్రీలంక పై విజయానికి భారత్ తహతహ 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్ – ఏ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్…నాలుగు విజయానికి ఉరకలేస్తోంది. మెల్బోర్న్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే లీగ్ ఆఖరిరౌండ్ మ్యాచ్ లో శ్రీలంకతో తలపడనుంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేయడం ద్వారా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొన్న భారత్ తన ఆఖరిరౌండ్ మ్యాచ్ లో సైతం హాట్ ఫేవరెట్ హోదాలో బరిలోకి దిగుతోంది. బౌలింగే భారత్ […]

ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో ఆఖరాట
X
  • శ్రీలంక పై విజయానికి భారత్ తహతహ

2020 మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్ – ఏ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్…నాలుగు విజయానికి ఉరకలేస్తోంది. మెల్బోర్న్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే లీగ్ ఆఖరిరౌండ్ మ్యాచ్ లో శ్రీలంకతో తలపడనుంది.

ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేయడం ద్వారా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొన్న భారత్ తన ఆఖరిరౌండ్ మ్యాచ్ లో సైతం హాట్ ఫేవరెట్ హోదాలో బరిలోకి దిగుతోంది.

బౌలింగే భారత్ బలం….

గ్రూప్- ఏలీగ్ మొదటి మూడురౌండ్లలోనూ తక్కువ స్కోర్లు మాత్రమే సాధించిన భారతజట్టు…పదునైన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్ అస్త్ర్రాలుగా విజయాలు సాధిస్తూ వచ్చింది.

ఆస్ట్ర్రేలియాతో ముగిసిన తొలిరౌండ్ మ్యాచ్ లో 18 పరుగులు, బంగ్లాదేశ్ పైన 17 పరుగులు, న్యూజిలాండ్ పైన 3 పరుగుల తేడాతో నెగ్గిన భారతజట్టు… తొలిరౌండ్లో 132, రెండోరౌండ్లో 142, మూడోరౌండ్లో 133 స్కోర్లే సాధించినా నెగ్గుకు రావడం విశేషం. అయితే..శ్రీలంకతో జరిగే ఆఖరిరౌండ్లో మాత్రం భారీస్కోరు సాధించడం ద్వారా సెమీస్ సమరానికి సమాయత్తం కావాలని భావిస్తోంది.

షఫాలీ పైనే భారత్ భారం…

సీనియర్ ప్లేయర్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతిమంధానా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోడంతో…జట్టు భారాన్ని టీనేజ్ ఓపెనర్ 16 సంవత్సరాల షఫాలీ వర్మ మాత్రమే మోస్తూ మ్యాచ్ విన్నర్ గా నిలుస్తూ వస్తోంది.

గత రెండుమ్యాచ్ ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకొన్న షఫాలీ 29, 39, 46 స్కోర్లతో సహా మొత్తం 114 పరుగులతో కీలకపాత్ర పోషిస్తోంది.

మరోవైపు…సూపర్ హిట్టర్, భారీ సెంచరీలు సాధించడంలో తనకుతానే సాటిగా నిలిచే చమారీ అటపట్టు నాయకత్వంలోని శ్రీలంకజట్టు స్థాయికి తగ్గట్టుగా ఆడితే భారత్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

ఇప్పటికే సెమీస్ చేరిన భారత్…ఎలాంటి ఒత్తిడి లేకుండా పోటీకి దిగుతుంటే…శ్రీలంక మాత్రం నాకౌట్ రౌండ్ చేరాలంటే …ఈ మ్యాచ్ లో భారీతేడాతో నెగ్గి తీరాల్సి ఉంది.

First Published:  28 Feb 2020 11:00 PM GMT
Next Story