Telugu Global
NEWS

టెస్ట్ ర్యాంకింగ్స్ లో కొహ్లీ డౌన్, స్మిత్ అప్

వరుస వైఫల్యాలతో విరాట్ కు పరీక్ష సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు విరాట్ కొహ్లీ…న్యూజిలాండ్ తో ముగిసిన తొలిటెస్ట్ వైఫల్యాలతో తన టాప్ ర్యాంక్ ను చేజార్చుకొన్నాడు. విరాట్ కొహ్లీ 906 పాయింట్లతో రెండోర్యాంక్ కు పడిపోయాడు. ఆస్ట్ర్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో టాప్ ర్యాంక్ కు చేరుకోగలిగాడు. న్యూజిలాండ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా వెలింగ్టన్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో […]

టెస్ట్ ర్యాంకింగ్స్ లో కొహ్లీ డౌన్, స్మిత్ అప్
X
  • వరుస వైఫల్యాలతో విరాట్ కు పరీక్ష

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు విరాట్ కొహ్లీ…న్యూజిలాండ్ తో ముగిసిన తొలిటెస్ట్ వైఫల్యాలతో తన టాప్ ర్యాంక్ ను చేజార్చుకొన్నాడు.

విరాట్ కొహ్లీ 906 పాయింట్లతో రెండోర్యాంక్ కు పడిపోయాడు. ఆస్ట్ర్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో టాప్ ర్యాంక్ కు చేరుకోగలిగాడు.

న్యూజిలాండ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా వెలింగ్టన్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 2, రెండో ఇన్నింగ్స్ లో 19 పరుగులు మాత్రమే చేసినకొహ్లీ కీలక ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయాడు.

క్రైస్ట్ చర్చి వేదికగా శనివారం ప్రారంభమయ్యే ఆఖరిటెస్టులో విరాట్ మూడంకెల స్కోరు సాధించగలిగితే… తిరిగి టాప్ ర్యాంక్ ను కైవసం చేసుకొనే అవకాశాలు లేకపోలేదు.

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ మూడోర్యాంక్ కు చేరుకోగలిగాడు. భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా సైతం రెండుస్థానాలు దిగజారి… 9వ ర్యాంక్ కు పడిపోయాడు.

భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే మాత్రం తన ర్యాంక్ ను ఓ స్థానం మేర మెరుగుపరచుకొని 8వ స్థానంలో నిలిచాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ న్యూజిలాండ్ తో తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లో కలసి 92 పరుగులు సాధించడం ద్వారా… తన కెరియర్ లోనే అత్యుత్తమంగా 10వ ర్యాంక్ సాధించాడు.

టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ టాప్ టెన్ ర్యాంకింగ్స్ లో నలుగురు భారత ఆటగాళ్లు నిలవడం విశేషం. బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఇశాంత్ శర్మ 17వ స్థానం సంపాదించాడు.

First Published:  27 Feb 2020 12:50 AM GMT
Next Story