Telugu Global
National

ట్రంప్ టూర్: మోడీకి గట్టి షాకిచ్చిన కాంగ్రెస్

ప్రపంచపు పెద్దన్న, అగ్రరాజ్యపు అధినేత ట్రంప్ ను భారత్ కు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఆనందానికి అవధులు లేవు. మోడీ గ్రేట్ అంటూ బీజేపీ శ్రేణులు సంబంరాలు చేసుకుంటున్నాయి. అయితే వీరి ఆనందోత్సవాలు ఎంత ఉన్నా ఏ దేశాధినేత భారత్ కు వచ్చినా ప్రతిపక్ష నేతలను ఆహ్వానించి వారితో సమావేశం నిర్వహించడం కనీస సంప్రదాయం. భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికాకు వెళ్లినప్పుడు కూడా అక్కడి ప్రధాన ప్రతిపక్ష నేతలను కలవడం సంప్రదాయం. ట్రంప్ కూడా ఈ ఏర్పాట్లు […]

ట్రంప్ టూర్: మోడీకి గట్టి షాకిచ్చిన కాంగ్రెస్
X

ప్రపంచపు పెద్దన్న, అగ్రరాజ్యపు అధినేత ట్రంప్ ను భారత్ కు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఆనందానికి అవధులు లేవు. మోడీ గ్రేట్ అంటూ బీజేపీ శ్రేణులు సంబంరాలు చేసుకుంటున్నాయి. అయితే వీరి ఆనందోత్సవాలు ఎంత ఉన్నా ఏ దేశాధినేత భారత్ కు వచ్చినా ప్రతిపక్ష నేతలను ఆహ్వానించి వారితో సమావేశం నిర్వహించడం కనీస సంప్రదాయం.

భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికాకు వెళ్లినప్పుడు కూడా అక్కడి ప్రధాన ప్రతిపక్ష నేతలను కలవడం సంప్రదాయం. ట్రంప్ కూడా ఈ ఏర్పాట్లు చేశారు.

అయితే ఘనత వహించిన మన ప్రధాని మోడీ ట్రంప్ పర్యటనలో ప్రతిపక్షాలను అవమానించారు. అందుకే తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మోడీకి గట్టి షాకిచ్చారు. తాను ట్రంప్ విందుకు హాజరుకావడం లేదని తేల్చిచెప్పారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం అందించారు. ఆరోగ్య కారణాలతోనే తాను హాజరు కావడం లేదని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి కార్యాలయానికి తెలిపారు.

మన్మోహన్ సింగ్ రాకపోవడానికి అసలు కారణం వేరే ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఆహ్వానం అందకపోవడంతోనే మన్మోహన్ ఈ విందుకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షురాలైన సోనియాను ఆహ్వానించకపోవడం అవమానమని.. ఆమె పాల్గొనకుంటే తాము ఎలా పాల్గొంటామని రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ కూడా విందుకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే లోక్ సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి కూడా ఈ విందుకు తాను వెళ్లడం లేదని ప్రకటించారు.

దీంతో ప్రతిపక్షాలు లేకుండా ట్రంప్ పర్యటన కొనసాగుతుండడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోడీ ఎంత ప్రచారం చేసుకున్నా… ప్రతిపక్షాలకు కనీస మర్యాద ఇవ్వని వైనం చర్చనీయాంశంగా మారింది.

First Published:  25 Feb 2020 1:11 AM GMT
Next Story