Telugu Global
International

అమెరికాలో బయల్దేరిన అగ్ర దేశాధినేత... ఆయనతో వచ్చేది వీళ్లే!

అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో రెండు రోజుల పర్యటన కోసం వైట్ హౌస్ నుంచి బయలుదేరారు. ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి తొలుత హెలీకాఫ్టర్‌లో శ్వేతసౌధం నుంచి వాషింగ్టన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఇండియాకు బయలుదేరారు. యూరోప్‌లోని జర్మని మీదుగా డొనాల్డ్ ట్రంప్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం 11.40కి చేరుకోనున్నారు. అనంతరం ఆయన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి పాల్గొననున్నారు. ప్రపంచంలోనే […]

అమెరికాలో బయల్దేరిన అగ్ర దేశాధినేత... ఆయనతో వచ్చేది వీళ్లే!
X

అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో రెండు రోజుల పర్యటన కోసం వైట్ హౌస్ నుంచి బయలుదేరారు. ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి తొలుత హెలీకాఫ్టర్‌లో శ్వేతసౌధం నుంచి వాషింగ్టన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఇండియాకు బయలుదేరారు.

యూరోప్‌లోని జర్మని మీదుగా డొనాల్డ్ ట్రంప్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం 11.40కి చేరుకోనున్నారు. అనంతరం ఆయన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి పాల్గొననున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాను ప్రారంభించిన అనంతరం అక్కడే అధికారిక కార్యక్రమం నిర్వహిస్తారు.

కాగా, ట్రంప్ ఇండియాలో చేస్తున్న అధికారిక పర్యటనలో పలువురు ముఖ్యులు కూడా వస్తున్నారు. వారి వివరాలను శ్వేతసౌధం ప్రకటించింది.

  • ఇండియాలో అమెరికా రాయబారి : కెన్ జుస్టర్
  • అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి : విల్బర్ రోస్
  • ఇంధన శాఖ కార్యదర్శి : డాన్ బ్రోలిట్
  • ట్రంప్ తాత్కాలిక చీఫ్ ఆఫ్ స్టాఫ్ : మిక్ ముల్ వనే
  • జాతీయ భద్రతా సలహాదారు : ఇవాంకా ట్రంప్
  • ట్రంప్ సహాయకుడు, సీనియర్ సలహాదారు : జరేడ్ కుష్నర్
  • సీనియర్ సలహాదారు : స్టీఫెన్ మిల్లర్
  • డిజిటల్ మీడియా స్ట్రాటజిస్ట్ : డాన్ స్కేవినో
  • ఫస్ట్ లేడీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ : లిండ్సే రేనోల్డ్స్
  • స్పెషల్ రిప్రజెంటేటీవ్ ఫర్ టెలికమ్యునికేషన్ పాలసీ : రాబర్ట్ బ్లెయిర్
  • ప్రెస్ సెక్రెటరీ అండ్ ఫస్ట్ లేడీ కమ్యునికేషన్స్ డైరెక్టర్ : స్టీఫెన్ గ్రీషం
First Published:  23 Feb 2020 8:53 PM GMT
Next Story