Telugu Global
NEWS

ఆ విషయంలో ధర్మాన పలుచనయ్యాడా?

ఏపీ రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావుది అందేవేసిన చేయి. శత్రవులను కూడా తనవైపు తిప్పుకొని చక్రం తిప్పుకుంటారు. అయితే ఒక విషయంలో ధర్మాన వ్యూహం బెడిసికొడింది. ఆయన అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి.. దీంతో ధర్మాన ప్రసాద్ ‘పవర్’ తగ్గిందా అనే చర్చ నడుస్తోంది. మునుపటిలా రాజకీయాల్లో చక్రం తిప్పలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన వరప్రసాద్ ఎంత చెబితే అంతే. ఆయన ఎటు వెళితే అటు తన సైన్యం కదులుతుంది. అలాంటి నాయకుడికి శ్రీకాకుళం […]

ఆ విషయంలో ధర్మాన పలుచనయ్యాడా?
X

ఏపీ రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావుది అందేవేసిన చేయి. శత్రవులను కూడా తనవైపు తిప్పుకొని చక్రం తిప్పుకుంటారు. అయితే ఒక విషయంలో ధర్మాన వ్యూహం బెడిసికొడింది. ఆయన అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి.. దీంతో ధర్మాన ప్రసాద్ ‘పవర్’ తగ్గిందా అనే చర్చ నడుస్తోంది. మునుపటిలా రాజకీయాల్లో చక్రం తిప్పలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన వరప్రసాద్ ఎంత చెబితే అంతే. ఆయన ఎటు వెళితే అటు తన సైన్యం కదులుతుంది. అలాంటి నాయకుడికి శ్రీకాకుళం వర్తక సంఘంలోని సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. శ్రీకాకుళం వర్తక సంఘంలో నాలుగు గ్రూపులున్నాయి. ఇందులో మూడు గ్రూపులు వైసీపీకి చెందినవి కాగా మరొక గ్రూపు టీడీపీకి మద్దుతు ఇస్తుంది. అయితే వర్తక సంఘంలో ఆధిపత్యం చెలాయిచాలంటే ధర్మాన అనుచరుడే ఉండాలని ఆయన పక్కనున్న నేతలు నూరిపోసారు. పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు ధర్మానకు వ్యతిరేకంగా మరో గ్రూపు తయారుచేశారట.

అవకాశం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ వర్గం నేతలు ధర్మానకు వ్యతిరేకంగా ఉన్న వర్తక సంఘం నేతలకు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల ధర్మాన తన అనుకూల వర్గంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కేవలం 20మంది పాల్గొన్నారు. కాగా ఆయన వ్యతిరేక వర్గం నిర్వహించిన రక్తదాన శిబిరానికి 200మంది పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ వ్యతిరేకులను, సానుభూతిపరులను కూడా తనవైపు తిప్పుకుని గెలవడం ధర్మానకు వెన్నతో పెట్టిన విద్య. అయితే తన అనుచరుడే వర్తకసంఘం నేతగా ఉండాలని ఇతరులు చెప్పిన మాటలు విని వర్తక సంఘంలో వ్యతిరేక వర్గాన్ని తయారు చేసుకున్నాడట.

వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కుతుందని ధర్మాన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అలాంటిదేమీ జరుగలేదు. దీంతో కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ప్రస్తుతం సొంత పార్టీలోని వర్తక సంఘం నేతలు ఇచ్చిన షాక్ తో ఆయన స్థాయి జిల్లా రాజకీయాల్లో దిగజారినట్లు కన్పిస్తోందట.. వర్తక సంఘంలో పెత్తనం చెలాయించాలనుకుంటే ఇలా జరిగిందేంటీ అని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడేందుకు అందరినీ కలుపుకునిపోయే పనిలో పడ్డారట. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ధర్మాన ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడుతారో వేచిచూడాల్సిందే.

First Published:  23 Feb 2020 9:35 PM GMT
Next Story