రేవంత్ వాదనను టీ కాంగ్రెస్ నేతలు జనాల్లోకి తీసుకెళ్లగలరా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతోంది. పార్టీని నడిపిస్తున్న నేతల తీరు.. కేడర్ ను అయోమయంలోకి నెడుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు పదవి నుంచి తప్పుకొంటానంటూ అస్త్ర సన్యాసం చేసేందుకు ముందుకు రాగా.. త్వరలోనే పీసీసీకి కొత్త బాస్ వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే తరుణంలో.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కూడా సమయం దగ్గరపడుతోంది. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను.. వాటిలో […]
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతోంది. పార్టీని నడిపిస్తున్న నేతల తీరు.. కేడర్ ను అయోమయంలోకి నెడుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు పదవి నుంచి తప్పుకొంటానంటూ అస్త్ర సన్యాసం చేసేందుకు ముందుకు రాగా.. త్వరలోనే పీసీసీకి కొత్త బాస్ వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే తరుణంలో.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కూడా సమయం దగ్గరపడుతోంది.
గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను.. వాటిలో కీలకమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వంటివి తీర్చలేకపోయిన వైనాన్ని.. టీ కాంగ్రెస్ లో అందరికంటే రేవంత్ రెడ్డి కాస్త బలంగా వినిపిస్తున్నారు. పట్టణ ప్రగతి అంటూ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. కాంగ్రెస్ నేతలెవరూ బయటికి వచ్చి గట్టిగా మాట్లాడడం లేదు. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రశ్నలు.. ఒకింత టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగానే ఉన్నాయి.
హైదరాబాద్ లో శంకుస్థాపన జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోము.. అంటూ సాక్షాత్తూ సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని రేవంత్ బలంగా గుర్తు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో శంకుస్థాపనలు పూర్తై.. నిర్మాణాలు పెండింగ్ లో ఉన్న భవనాల గురించి ప్రశ్నిస్తున్నారు. అంతా బానే ఉంది కానీ.. ఈ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయనకు తగిన అండ లేకుండా పోతోంది.
టీ కాంగ్రెస్ లో మర్రి శశిధర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్, జానారెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి.. ఇలా నేతలంతా ఎవరికి వారు వ్యక్తిగత ఇమేజ్ తో సీనియర్లుగా ఉన్నారే తప్ప.. రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ ను నడిపించేంతగా ప్రభావం చూపించలేకపోతున్నారు.
ఇలాంటి సమయంలో.. రేవంత్ కు అంతగా తోటి నేతల నుంచి మద్దతు వస్తుందని కూడా ఎవరూ భావించడం లేదు. కానీ.. ఇన్ని వాలీడ్ పాయింట్లు మాట్లాడుతున్నప్పుడు వాటిని జనాల్లోకి తీసుకెళ్తే.. పార్టీకి అంతో ఇంతో ప్రయోజనకరమన్న వాదన అయితే.. కార్యకర్తల్లో వినిపిస్తోంది.