Telugu Global
CRIME

మరీ ఇంత దారుణమా....?

గుజరాత్ లో మహిళలపై వివక్ష ఏ స్థాయిలో ఉందో తెలిపేలా.. మరో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఇప్పటికే.. ఓ విద్యాసంస్థలో రుతుస్రావం ఉన్న అమ్మాయిలను గుర్తించేందుకు వివస్త్రలుగా చేసి పరిశీలించిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా జరిగిన మరో ఘటన గుజరాత్ లో మహిళలపై వివక్షను మరోసారి స్పష్టం చేసింది. ఈ సారి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఘటన.. మహిళా సమాజాన్ని ఆవేదనకు గురి చేస్తోంది. పూర్తి వివరాలలోకి వెళ్తే… గుజరాత్ లోని సూరత్ మున్సిపల్ […]

మరీ ఇంత దారుణమా....?
X

గుజరాత్ లో మహిళలపై వివక్ష ఏ స్థాయిలో ఉందో తెలిపేలా.. మరో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఇప్పటికే.. ఓ విద్యాసంస్థలో రుతుస్రావం ఉన్న అమ్మాయిలను గుర్తించేందుకు వివస్త్రలుగా చేసి పరిశీలించిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా జరిగిన మరో ఘటన గుజరాత్ లో మహిళలపై వివక్షను మరోసారి స్పష్టం చేసింది. ఈ సారి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఘటన.. మహిళా సమాజాన్ని ఆవేదనకు గురి చేస్తోంది.

పూర్తి వివరాలలోకి వెళ్తే… గుజరాత్ లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే ట్రైనీ సిబ్బంది.. మూడేళ్ల శిక్షణ కాలం పూర్తయిన తర్వాత.. ఫిజికల్ ఫిట్ నెస్ తప్పనిసరిగా చేయించుకోవాలి. అలా.. పది మంది మహిళా ట్రైనీలు టెస్ట్ కోసం సూరత్ మున్సిపల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రికి వెళ్లగా.. వారికి జీవితంలో మరిచిపోలేని సంఘటన ఎదురైంది.

ఆ పది మంది మహిళా ట్రైనీలను లోనికి పిలిపించిన డాక్టరు.. అందరితో వస్త్రాలు విప్పించేశారట. నగ్నంగా నిలబెట్టి పరీక్షించారట. అవివాహితులకూ గర్భ నిర్థారణ పరీక్షలు చేశారట. ఈ అనూహ్య పరిణామానికి షాక్ తిన్న సదరు ట్రైనీలు.. కన్నీటి పర్యంతమయ్యారు. విషయం సూరత్ మున్సిపల్ కమిషనర్ బంచనిధి పాణీ దృష్టికి వెళ్లింది. చివరికి ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటైంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.

ఈ విషయంపై.. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు పరీక్షలు చేయాల్సింది పోయి.. ఇలా ప్రవర్తించడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాగే తనిఖీ చేయాలని సూరత్ మున్సిపాలిటీలో రాసి ఉందా.. అని అధికారులకు ప్రశ్నిస్తున్నారు.

First Published:  21 Feb 2020 9:30 PM GMT
Next Story