Telugu Global
NEWS

'సీఆర్డీఏ అంటే... చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజెన్సీ'

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై.. ఆ పార్టీ కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా.. నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరైన తనను అడ్డుకోవడంపై.. ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత ప్రజలను, రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సీఆర్డీఏ పేరుతో.. ప్రజలను దోపిడీ చేశారని అన్నారు. సీఆర్డీఏ అంటే.. క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ కాదని.. చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ […]

సీఆర్డీఏ అంటే... చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజెన్సీ
X

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై.. ఆ పార్టీ కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా.. నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరైన తనను అడ్డుకోవడంపై.. ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత ప్రజలను, రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సీఆర్డీఏ పేరుతో.. ప్రజలను దోపిడీ చేశారని అన్నారు.

సీఆర్డీఏ అంటే.. క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ కాదని.. చంద్రబాబు రిలేషన్స్ దోపిడీ ఏజెన్సీలా మార్చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే పిన్నెల్లిపై దాడి చేశారని.. దళితుడన్న ఆలోచన లేకుండా ఎంపీ నందిగం సురేష్ పై దాడి చేశారని.. తర్వాత అధికారులపై దాడి చేశారని.. ఇప్పుడు తనపై దాడికి దిగారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి దాడి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ.. ఓ పెద్దకొడుకుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తుంటే.. అడ్డుకుంటున్నారని టీడీపీ నేతల తీరును తప్పుబట్టారు. రాజధాని అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్న టీడీపీ నేతలు.. కనీసం శాసనసభను కూడా అమరావతిలో కొనసాగించవద్దని అనుకుంటున్నారా.. అని ప్రశ్నించారు. ఇలా అందరిపై దాడులు చేస్తుంటే శాసనసభకు ఎలా హాజరుకాగలమని టీడీపీ నేతలను నిలదీశారు. నిజంగా టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే.. ఈ సమయానికే తాత్కాలిక నిర్మాణాలు కాకుండా.. పూర్తి స్థాయి శాశ్వత నిర్మాణాలు చేసి ఉండాల్సిందని చెప్పారు.

చంద్రబాబు 4 గ్రామాల కోసమే ఆలోచిస్తున్నారని.. జగన్ మాత్రం 13 జిల్లాల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారని రోజా స్పష్టం చేశారు. అందుకే కర్నూలులో, విశాఖలో జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చేసిన ఆంధ్రులకు.. మళ్లీ అలాంటి ఇబ్బంది రాకూడదన్నదే సీఎం జగన్ ఆరాటమని అన్నారు. 3 రాజధానులు వచ్చి తీరతాయని.. జగన్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి తీరుతారని తేల్చి చెప్పారు.

First Published:  20 Feb 2020 5:07 AM GMT
Next Story