Telugu Global
National

చంద్రబాబు అందుబాటులో లేరట!

తెలుగు దేశం ద్వితీయ శ్రేణి నాయకులు అడుగుతున్న ప్రశ్న ఇది. బాబుగారూ.. దయచేసి కాస్త స్పందించరూ. 2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు.. కాస్త మాట మాత్రమైనా స్పందించకుంటే ఎలా.. అన్న ప్రశ్నే అంతటా వినిపిస్తోంది. ఇలాగే మౌనంగా ఉంటే.. చట్టం తన పని తాను చేయాల్సి వచ్చినప్పుడు… ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం బాబుకి ఎదురవుతుందన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. పెండ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి.. చంద్రబాబుకు పీఏగా 2019 వరకూ పని చేశాడు. […]

చంద్రబాబు అందుబాటులో లేరట!
X

తెలుగు దేశం ద్వితీయ శ్రేణి నాయకులు అడుగుతున్న ప్రశ్న ఇది. బాబుగారూ.. దయచేసి కాస్త స్పందించరూ.

2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు.. కాస్త మాట మాత్రమైనా స్పందించకుంటే ఎలా.. అన్న ప్రశ్నే అంతటా వినిపిస్తోంది. ఇలాగే మౌనంగా ఉంటే.. చట్టం తన పని తాను చేయాల్సి వచ్చినప్పుడు… ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం బాబుకి ఎదురవుతుందన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది.

పెండ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి.. చంద్రబాబుకు పీఏగా 2019 వరకూ పని చేశాడు. దాదాపు పదేళ్లు చంద్రబాబు వెంటే ఉన్నాడని మీడియా కోడై కూస్తోంది. అంటే.. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ఐదేళ్లు అధికారంలో లేని కాలంతో పాటు.. నవ్యాంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాక మరో ఐదేళ్లు చంద్రబాబు దగ్గర ఆయన పీఏగా పనిచేశాడు. అంటే.. అధికారంలో లేని సమయంలో వ్యక్తిగత వ్యవహారాలతో పాటు.. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యవహారాలనూ చక్కబెట్టినట్టే లెక్క. ఇది ఏం మామూలు విషయం కాదు.

ఇంకో ముఖ్యమైన విషయం…. 2 వేల కోట్లు అంటే.. ఏ ఒక్క సంవత్సరంలోనో సంపాదించేంత మొత్తమైతే కాదు. కొన్నేళ్లుగా ఆ పెండ్యాల శ్రీనివాస్.. చేరదీసిన సొమ్మై ఉంటుంది. అది చంద్రబాబు దగ్గర పీఏగా పనిచేస్తున్న సమయమే కాబట్టి.. ఆ సొమ్ములో చంద్రబాబు ప్రమేయం ఏంటి అన్నదే అందరూ ప్రశ్నిస్తున్నారు.

ఇదే… తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదీ కాక.. ఓ జాతీయ మీడియా కూడా.. ఈ విషయంలో వివరణ కోసం ప్రయత్నిస్తే చంద్రబాబు అందుబాటులో లేరని కథనం వేయడం.. వారిని మరింతగా ఇబ్బంది పెడుతోంది.

సీనియర్ నాయకులు ఎలాగూ ప్రధాన కార్యాలయాలకు పరిమితం అవుతున్నారు. చంద్రబాబు ఈ మధ్య మీడియా ముందుకే రావడం లేదు. లోకేష్ ట్విట్టర్ ను వదలడం లేదు. అందుకే.. అంతా అడుగుతున్నారు.. బాబ్బాబూ.. దయచేసి ఈ వ్యవహారంపై స్పందించండి అని. మరి మన బాబు గారికి ఎప్పుడు తీరిక దొరుకుతుందో చూడాలి!

First Published:  15 Feb 2020 9:25 PM GMT
Next Story