Telugu Global
NEWS

100 మీటర్ల పరుగులో జమైకన్ రన్నర్ సంచలనం

తల్లిగా 100 మీటర్ల స్వర్ణం నెగ్గిన యాన్ పెర్సీ ఫ్రెజర్ జమైకన్ స్ర్ప్రింట్ క్వీన్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైసీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ బిడ్డకు తల్లిగా…100 మీటర్ల పరుగులో ప్రపంచ టైటిల్ సాధించిన తొలిమహిళగా చరిత్ర సృష్టించింది. 33 సంవత్సరాల వయసులో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన రన్నర్ గా నిలిచింది. ప్రపంచ, ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో జమైకాకు డజన్లకొద్దీ పతకాలు సాధించి పెట్టిన యాన్ ఫ్రేజర్ ఓ బిడ్డకు జన్మనివ్వడం కోసం […]

100 మీటర్ల పరుగులో జమైకన్ రన్నర్ సంచలనం
X
  • తల్లిగా 100 మీటర్ల స్వర్ణం నెగ్గిన యాన్ పెర్సీ ఫ్రెజర్

జమైకన్ స్ర్ప్రింట్ క్వీన్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైసీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ బిడ్డకు తల్లిగా…100 మీటర్ల పరుగులో ప్రపంచ టైటిల్ సాధించిన తొలిమహిళగా చరిత్ర సృష్టించింది. 33 సంవత్సరాల వయసులో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన రన్నర్ గా నిలిచింది.

ప్రపంచ, ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో జమైకాకు డజన్లకొద్దీ పతకాలు సాధించి పెట్టిన యాన్ ఫ్రేజర్ ఓ బిడ్డకు జన్మనివ్వడం కోసం ఏడాదికాలంగా పరుగుపోటీలకు దూరమయ్యింది.

దోహా వేదికగా ముగిసిన 2019 ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల ద్వారా రీ-ఎంట్రీ చేసిన యాన్…32 ఏళ్ల వయసులో బంగారు పతకం నెగ్గి వారేవ్వా అనిపించుకొంది.

ఓ తల్లిగా ప్రపంచటైటిల్ నెగ్గడంతో పాటు… మహిళల 100 మీటర్ల పరుగులో లేటు వయసులో బంగారు పతకం సాధించిన మహిళగా జంట రికార్డులు సాధించింది.

క్యో ఒలింపిక్స్ కు అర్హత…

2008, 2012 ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల రేస్ లో బంగారు పతకాలు సాధించిన యాన్…2020 టోక్యో ఒలింపిక్స్ లో సైతం పాల్గొనటానికి అర్హత సంపాదించింది.

ఒకవేళ టోక్యో గేమ్స్ లో సైతం టైటిల్ నెగ్గితే 33 సంవత్సరాల వయసులో స్వర్ణం నెగ్గిన అథ్లెట్ గా, ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగు స్వర్ణాల హ్యాట్రిక్ సాధించిన స్ప్ర్రింటర్ గా చరిత్రలో మిగిలిపోతుంది.

తన కెరియర్ లో టోక్యో ఒలింపిక్సే ఆఖరి ఒలింపిక్స్ అని, అమెరికా వేదికగా జరిగే 2021 ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో చివరిసారిగా పాల్గొని రిటైర్ కావాలని యాన్ ఫ్రేజర్ భావిస్తోంది.

తన సుదీర్ఘ కెరియర్ లో యాన్ ఫ్రేజర్ ఇప్పటి వరకూ ఆరు ఒలింపిక్స్, 11 ప్రపంచ పతకాలు సాధించింది. ఇందులో తొమ్మిది స్వర్ణపతకాలు సైతం ఉన్నాయి.

టోక్యో ఒలింపిక్స్ 100, 200 మీటర్ల విభాగాలలో స్వర్ణాల కోసం తాను సాధన చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ సాధించిన 17 పతకాలలో దేని ప్రత్యేకత దానిదేనని…. అయితే… ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లిహోదాలో సాధించిన బంగారు పతకమే తనకు అపురూపమని ప్రకటించింది.

ప్రసవం తర్వాత తాను పలు రకాల సమస్యలు ఎదుర్కొన్నానని…భరించలేని నొప్పులను అధిగమించానని, అదుపుతప్పిన శరీరాన్ని గాడిలో పెట్టడానికి నానాపాట్లు పడ్డానని గుర్తు చేసుకొంది. పరుగుమీద ఉన్న ప్రేమతోనే ఇంతగా కష్టపడ్డానని… చివరికి కుమారుడు సాక్షిగా ప్రపంచ పరుగులో బంగారు పతకం అందుకోడంతో… పడిన కష్టం అంతా మరచిపోయానని పొంగిపోతూ చెప్పింది.

First Published:  14 Feb 2020 8:10 PM GMT
Next Story