Telugu Global
Cinema & Entertainment

'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా రివ్యూ

రివ్యూ : వరల్డ్ ఫేమస్ లవర్ రేటింగ్ : 2/5 తారాగణం : విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్ లీట్, కాథరిన్, జయ ప్రకాష్, ప్రియదర్శి తదితరులు సంగీతం : గోపి సుందర్ నిర్మాత : కెఏ వల్లభ, కెఎస్ రామ రావు దర్శకత్వం : క్రాంతి మాధవ్ ఈ మధ్యనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే […]

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ
X

రివ్యూ : వరల్డ్ ఫేమస్ లవర్
రేటింగ్ : 2/5
తారాగణం : విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్ లీట్, కాథరిన్, జయ ప్రకాష్, ప్రియదర్శి తదితరులు
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : కెఏ వల్లభ, కెఎస్ రామ రావు
దర్శకత్వం : క్రాంతి మాధవ్

ఈ మధ్యనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొట్టమొదటిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.

రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్ లీట్, క్యాథరిన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. టీజర్ మరియు ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచిన దర్శకనిర్మాతలు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14 న ఈ సినిమాను విడుదల చేశారు.

కథ:

గౌతమ్‌ (విజయ్ దేవరకొండ) ఒక ఖైదీ. జైలు జీవితం తో సతమవుతుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే గౌతమ్, యామిని (రాశీ ఖన్నా) ప్రేమించుకుంటారు. ఆమెతో గౌతమ్ లివింగ్ రిలేషన్‌షిప్ లో ఉంటాడు. కానీ వారిమధ్య గొడవలు అవుతూ ఉంటాయి. కెరీర్ పరంగా గౌతమ్ ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో గౌతమ్ ఒక కథ రాసుకున్నాడు. ఆ కథేంటి? గౌతమ్, యామిని వారిమధ్య గొడవలు తగ్గాయా? పెరిగాయా? వారిద్దరూ విడిపోయారా? రైటర్ అవ్వాలి అనుకునే గౌతమ్ కల నెరవేరిందా? చివరికి ఏమైంది? అంటే… సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి ఒక ఛాలెంజింగ్ పాత్ర దొరికింది అని చెప్పుకోవాలి. విజయ్ దేవరకొండ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. తన పాత్రలో ఒదిగిపోయి విజయ్ దేవరకొండ సినిమాకి వెన్నెముకగా నిలిచాడు.

ముఖ్య హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నా ఈ సినిమాలో కేవలం తన అందంతో మాత్రమే కాక అభినయంతో కూడా అందరినీ ఆకట్టుకుంది. తన పాత్రలో ఒదిగిపోయి రాశి ఖన్నా ఈ సినిమాలో చాలా బాగా నటించింది.

రాశి ఖన్నా తర్వాత నటన పరంగా ఐశ్వర్య రాజేష్ కు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పుకోవచ్చు. రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రమే కాక ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించింది.

కాథరిన్ కూడా తన పాత్రకి ఓకే అనిపించుకుంది. ఇసబెల్ లీట్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. జయప్రకాష్ చాలా సహజంగా నటించాడు. ప్రియదర్శి తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.

సాంకేతిక వర్గం:

ఇంతకు ముందు చూసిన ప్రేమ కథల కంటే ఈ చిత్రం చాలా భిన్నంగా ఉందని చెప్పవచ్చు. సినిమాలో నాలుగు ప్రేమకథలు ఉన్నప్పటికీ దర్శకుడు క్రాంతి మాధవ్ ప్రతి ప్రేమ కథ అందరి మనసులను హత్తుకునే విధంగా రచించడమే కాక దాన్ని తెరపై చూపించారు కూడా. కథ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నప్పటికీ దర్శకుడు కథని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పుకోవచ్చు. తన నెరేషన్ తో దర్శకుడు ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా ఆకట్టుకున్నాడు.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా మారాయని చెప్పుకోవచ్చు. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి చాలా బాగా సహాయం చేసింది. పాటలు మాత్రమే కాక ఈ సినిమాకి గోపి సుందర్ మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించారు. జయ కృష్ణ అందించిన విజువల్స్ మరియు కెమెరా యాంగిల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

విజయ్ దేవరకొండ, కథ, శీనయ్య-సువర్ణ కథ

బలహీనతలు:

స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్, క్లైమాక్స్, ఎమోషనల్ సన్నివేశాలు

First Published:  14 Feb 2020 4:44 AM GMT
Next Story