Telugu Global
NEWS

టీడీపీ నేతలకు షాకిచ్చిన వైసీపీ సర్కారు

టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వైసీపీ సర్కారు గట్టి షాక్ ఇచ్చింది. అందరికీ భద్రతను తగ్గిస్తూ.. కొందరికి పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. టీడీపీ మాజీ మంత్రి ఉమమహేశ్వరరావు ఇది వైసీపీ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత అయిన జేసీ దివాకర్ రెడ్డిని టార్గెట్ చేసిన ప్రభుత్వం తాజాగా ఆయనకు మరో గట్టి షాక్ […]

టీడీపీ నేతలకు షాకిచ్చిన వైసీపీ సర్కారు
X

టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వైసీపీ సర్కారు గట్టి షాక్ ఇచ్చింది. అందరికీ భద్రతను తగ్గిస్తూ.. కొందరికి పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. టీడీపీ మాజీ మంత్రి ఉమమహేశ్వరరావు ఇది వైసీపీ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనంతపురం మాజీ ఎంపీ, టీడీపీ నేత అయిన జేసీ దివాకర్ రెడ్డిని టార్గెట్ చేసిన ప్రభుత్వం తాజాగా ఆయనకు మరో గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఆయనకున్న ప్రధాన బిజినెస్ అయిన దివాకర్ ట్రావెల్స్ అక్రమాలను బయటకుతీసి బస్సులను సీజ్ చేసిన ప్రభుత్వం… తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి భద్రతను పూర్తిగా తొలగించింది. రూ.100 కోట్ల జరిమానా వేసే అవకాశం ఉందని ఏపీ రవాణా శాఖ జాయింట్ కమిషన్ ప్రసాద్ రావు ఇటీవల తెలిపారు.

జేసీ దివాకర్ రెడ్డికి గతంలో టీడీపీ హయాంలో 2+2 భద్రత ఉండేది. జగన్ సర్కారు వచ్చాక దాన్ని 1+1కు తగ్గించింది. తాజాగా జేసీకి పూర్తిగా భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్యురిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు గత రాత్రి నుంచి జేసీ దివాకర్ రెడ్డికి భద్రత తొలగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా జేసీ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయనను అవమానించారు. జగన్ ను టార్గెట్ చేసి రాజకీయం చేశారు. ఇప్పుడు ఆయన అక్రమాలను సర్కారు వెలికి తీస్తూ…. వైసీపీ ప్రభుత్వానికి బలైపోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

First Published:  11 Feb 2020 9:56 PM GMT
Next Story