Telugu Global
NEWS

కివీస్ తో వన్డే సిరీస్ లో భారత్ కు వైట్ వాష్

మూడుకు మూడుమ్యాచ్ లూ ఓడిన విరాట్ సేన న్యూజిలాండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో రెండోర్యాంకర్ భారత్ ఘోరపరాజయం చవిచూసింది. మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ ఓటమి పొంది సిరీస్ కోల్పోయింది. పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో భారత్ 5-0తో బ్రౌన్ వాష్ సాధిస్తే…వన్డే సిరీస్ లో ఆతిథ్య న్యూజిలాండ్ వైట్ వాష్ తో బదులిచ్చింది. మౌంట్ మగానులోని బే ఓవల్ వేదికగా ముగిసిన సిరీస్ ఆఖరివన్డేలో..కెఎల్ రాహుల్ సెంచరీ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో […]

కివీస్ తో వన్డే సిరీస్ లో భారత్ కు వైట్ వాష్
X
  • మూడుకు మూడుమ్యాచ్ లూ ఓడిన విరాట్ సేన

న్యూజిలాండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో రెండోర్యాంకర్ భారత్ ఘోరపరాజయం చవిచూసింది. మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ ఓటమి పొంది సిరీస్ కోల్పోయింది.

పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో భారత్ 5-0తో బ్రౌన్ వాష్ సాధిస్తే…వన్డే సిరీస్ లో ఆతిథ్య న్యూజిలాండ్ వైట్ వాష్ తో బదులిచ్చింది.

మౌంట్ మగానులోని బే ఓవల్ వేదికగా ముగిసిన సిరీస్ ఆఖరివన్డేలో..కెఎల్ రాహుల్ సెంచరీ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో ఆదుకొన్నా భారత్ సఫలంకాలేకపోయింది.

తనముందుంచిన 298 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో కేవలం 5 వికెట్ల నష్టానికే సాధించగలిగింది. హెన్రీ నికోల్స్ 80, గప్టిల్ 66, గ్రాండ్ హామీ హాఫ్ సెంచరీలతో తమ జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు.

1989లో వెస్టిండీస్ చేతిలో భారత్ 0-5తో వన్డే సిరీస్ ఓటమి చవిచూసిన తర్వాత…మరో సిరీస్ ఓటమి పొందటం ఇదే మొదటిసారి. విరాట్ కొహ్లీ నాయకత్వంలో.. భారత్ ఓ వన్డే సిరీస్ లో చిత్తుగా ఓడటం ఇదే మొదటిసారి.

First Published:  11 Feb 2020 7:02 PM GMT
Next Story