సెలెక్ట్ కమిటీ పై చైర్మన్‌కు షాక్... ఫైలు వెనక్కి పంపిన కార్యదర్శి..!
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులు మండలిలో పాస్ కాకుండా చంద్రబాబు కనుసన్నల్లో మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ వాటిని సెలెక్ట్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే. ఇటీవలే వాటికి సంబంధించి సెలెక్ట్ కమిటీలను కూడా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, సెలెక్ట్ కమిటీలను నియమించాలని చైర్మన్ పంపిన ఫైలును లెజిస్లేచర్ సెక్రెటరీ పి. బాలకృష్ణమాచార్య వెనక్కు పంపినట్లు తెలుస్తోంది. 154వ నిబంధన ప్రకారం సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఆ ఫైలుపై నోట్ రాసి పంపినట్లు […]
పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులు మండలిలో పాస్ కాకుండా చంద్రబాబు కనుసన్నల్లో మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ వాటిని సెలెక్ట్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే. ఇటీవలే వాటికి సంబంధించి సెలెక్ట్ కమిటీలను కూడా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, సెలెక్ట్ కమిటీలను నియమించాలని చైర్మన్ పంపిన ఫైలును లెజిస్లేచర్ సెక్రెటరీ పి. బాలకృష్ణమాచార్య వెనక్కు పంపినట్లు తెలుస్తోంది.
154వ నిబంధన ప్రకారం సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఆ ఫైలుపై నోట్ రాసి పంపినట్లు సమాచారం. కాగా, లెజిస్లేచర్ సెక్రెటరీని టీడీపీ ఎమ్మెల్సీలైన బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, నాగ జగదీష్, అశోక్‌బాబులు కలిసి సెలెక్ట్ కమిటీకి నోటిఫికేషన్ జారీ చేయాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు కూడా కార్యదర్శిపై ఒత్తిడి తేగా.. నిబంధనలకు విరుద్దంగా ఉంది కాబట్టే కమిటీ నియామకం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం.