Telugu Global
NEWS

న్యూజిలాండ్ టూర్ లో భారత్ కు తొలిదెబ్బ

తొలివన్డేలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ వృధా న్యూజిలాండ్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ కు తొలిదెబ్బ తగిలింది. తీన్మార్ వన్డే సిరీస్ లో భాగంగా హామిల్టన్ సెడ్డాన్ పార్క్ వేదికగా ముగిసిన తొలివన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ పై సూపర్ చేజింగ్ విజయం సాధించింది. హైస్కోరింగ్ పోరుగా సాగిన ఈ సమరంలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 347 పరుగుల భారీస్కోరు సాధించింది. […]

న్యూజిలాండ్ టూర్ లో భారత్ కు తొలిదెబ్బ
X
  • తొలివన్డేలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ వృధా

న్యూజిలాండ్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ కు తొలిదెబ్బ తగిలింది. తీన్మార్ వన్డే సిరీస్ లో భాగంగా హామిల్టన్ సెడ్డాన్ పార్క్ వేదికగా ముగిసిన తొలివన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ పై సూపర్ చేజింగ్ విజయం సాధించింది.

హైస్కోరింగ్ పోరుగా సాగిన ఈ సమరంలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 347 పరుగుల భారీస్కోరు సాధించింది.

నయా ఓపెనింగ్ జోడీ మయాంక్ అగర్వాల్, పృథీ షా మొదటి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం ఇచ్చినా… కెప్టెన్ కొహ్లీ 51, రాహుల్ 88, శ్రేయస్ అయ్యర్ 103 పరుగులు సాధించారు.

భారత నంబర్ -4 ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 16 వన్డేలలో ఇదే తొలి శతకం కావడం విశేషం. అయ్యర్ 107 బాల్స్ లో 11 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 103 పరుగులు సాధించాడు.

కివీస్ సూపర్ చేజింగ్ విన్…

348 పరుగుల రికార్డు లక్ష్యంతో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ కేవలం 48.1 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికే విజయం సొంతం చేసుకోగలిగింది. ఓపెనర్ మార్క్ నికోల్స్ 78 పరుగులు, కెప్టెన్ లాథమ్ 69 పరుగుల స్కోర్లతో హాఫ్ సెంచరీలు సాధించగా… మాజీ కెప్టెన్ రోజ్ టేలర్ 109 పరుగులతో అజేయంగా నిలిచాడు.

టేలర్ 84 బాల్స్ల్ లో 10 బౌండ్రీలు, 4 సిక్సర్లతో తన కెరియర్ లో 21వ సెంచరీ సాధించగలిగాడు. టేలర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

భారత బౌలర్లలో షమీ, ఠాకూర్ చెరో వికెట్, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.

భారత్ కు భారీ జరిమానా…

నిర్ణిత సమయంలో తన కోటా ఓవర్లు వేయలేకపోడంతో భారతజట్టుకు భారీగా జరిమానా పడింది. నిబంధనల ప్రకారం భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధించినట్లు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ప్రకటించారు. సిరీస్ లోని రెండో వన్డే అక్లాండ్ వేదికగా ఫిబ్రవరి 9న జరుగనుంది.

First Published:  5 Feb 2020 8:50 PM GMT
Next Story