Telugu Global
NEWS

రేవంత్ రెడ్డి... ఏ అవకాశాన్నీ వదలట్లేదుగా..!

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ పై తన పోరాటానికి ఏ అవకాశాన్నీ వదలడం లేదు. ఫైర్ బ్రాండ్ గా… టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా తయారైన రేవంత్.. మరోసారి తెలంగాణ అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టినట్టే కనిపిస్తోంది. 2017లో టీఆర్ఎస్ వార్షికోత్సవం సందర్భంగా.. వరంగల్ లో భారీ స్థాయిలో ప్రగతి నివేదన సభ నిర్వహించారు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ సభ నిర్వహణ కోసమని.. పార్టీకి చెందిన అగ్ర నేతలంతా కూలీ పని […]

రేవంత్ రెడ్డి... ఏ అవకాశాన్నీ వదలట్లేదుగా..!
X

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ పై తన పోరాటానికి ఏ అవకాశాన్నీ వదలడం లేదు. ఫైర్ బ్రాండ్ గా… టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా తయారైన రేవంత్.. మరోసారి తెలంగాణ అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టినట్టే కనిపిస్తోంది. 2017లో టీఆర్ఎస్ వార్షికోత్సవం సందర్భంగా.. వరంగల్ లో భారీ స్థాయిలో ప్రగతి నివేదన సభ నిర్వహించారు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

ఆ సభ నిర్వహణ కోసమని.. పార్టీకి చెందిన అగ్ర నేతలంతా కూలీ పని చేసి డబ్బులు సంపాదించారు. ఓ రకంగా చెప్పాలంటే.. విరాళాలు సేకరించారు. కానీ.. తట్టలు ఎత్తి వేలకు వేలు.. ఇటుకలు ఎత్తి లక్షలకు లక్షలు… ఇలా చిన్న చిన్న పనులకే ఆయా సంస్థల యాజమాన్యాల నుంచి డబ్బులు సేకరించారు. ఈ విషయాన్నే.. రేవంత్ రెడ్డి హైలైట్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించారని ఐటీని ఆశ్రయించారు.

ఇప్పుడు.. ఆ ఫిర్యాదు ప్రకారం.. ఐటీ విభాగం నుంచి టీఆర్ఎస్ అగ్ర నేతలకు… ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ తో పాటు.. నాటి సభ నిర్వహణలో కూలీ పని చేసి డబ్బులు సంపాదించిన ప్రముఖులందరికీ ఐటీ నుంచి నోటీసులు అందినట్టు.. ఓ మీడియా కథనాన్ని ప్రచురించింది.

ఆ నోటీసులకు వివరణ ఇచ్చే పనిలో నేతలు తలమునకలు అయి ఉన్నారని పేర్కొంది. అంతిమంగా.. టీఆర్ఎస్ నేతలకు ఏమీ కాకపోవచ్చు. ఇది కూడా.. తర్వాత అంతా చల్లబడిపోయే వ్యవహారమే కావొచ్చని కొందరంటున్నారు.

కానీ.. కూలీ పేరుతో సంపాదించిన మొత్తానికి లెక్కలు చెప్పాలంటూ.. ఆదాయ పన్ను శాఖ నుంచి నిజంగానే ఆయా నేతలకు నోటీసులు అందితే.. టీఆర్ఎస్ పై పోరాటంలో.. రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకు వేసినట్టేనని భావించాలి.

First Published:  5 Feb 2020 12:00 AM GMT
Next Story