నారావారిపల్లెలో వైసీపీ సభపై.... నారావారి మాట విన్నారా?
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారావారిపల్లెలో ఈ మధ్య వైసీపీ నాయకులు.. పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా భారీ సభ నిర్వహించారు. వేల సంఖ్యలో జన సమీకరణ చేయడంలోనూ విజయవంతం అయ్యారు. ఇది.. స్వయానా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సొంతూరు కావడంతో.. వైసీపీ సభపై రాజకీయంగా పెద్ద చర్చే జరిగింది. ఇంకా చెప్పాలంటే.. అధికార, విపక్షాల మధ్య.. ఈ సభ గురించి రచ్చే జరిగింది. ఇక.. తాజా విశేషం ఏంటంటే.. ఈ సభ గురించి చంద్రబాబు […]
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారావారిపల్లెలో ఈ మధ్య వైసీపీ నాయకులు.. పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా భారీ సభ నిర్వహించారు. వేల సంఖ్యలో జన సమీకరణ చేయడంలోనూ విజయవంతం అయ్యారు.
ఇది.. స్వయానా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సొంతూరు కావడంతో.. వైసీపీ సభపై రాజకీయంగా పెద్ద చర్చే జరిగింది. ఇంకా చెప్పాలంటే.. అధికార, విపక్షాల మధ్య.. ఈ సభ గురించి రచ్చే జరిగింది.
ఇక.. తాజా విశేషం ఏంటంటే.. ఈ సభ గురించి చంద్రబాబు స్పందించడం. తన గ్రామంలో జరిగిన వైసీపీ సభ గురించి ఒకింత ఆగ్రహంగానే మాట్లాడిన బాబు.. “ఎవరైనా మా ఊరి నుంచి వైజాగ్ వెళ్లాలని అనుకుంటారా.. మా ఊరి వాళ్లు అమరావతి దాటి వైజాగ్ వెళ్లాలని ఆలోచిస్తారా.. వంద శాతం అలా అనుకోరు. అలాంటప్పుడు ముడు రాజధానులకు మద్దతుగా మా ఊరిలో సభ పెడితే ఎవరు స్పందిస్తారు?” అంటూ చంద్రబాబు ప్రశ్నలు విసిరారు.
అంతా బానే ఉంది కానీ.. నారావారిపల్లె నుంచి విశాఖకు వెళ్లాలని ఎందుకు కోరుకోకూడదు.. అన్న చర్చ చంద్రబాబు కామెంట్ల తర్వాత మొదలైంది. అయితే గతం కంటే చంద్రబాబుకు మెజారిటీ తగ్గిందని… ఎంతటి స్వగ్రామమైనా.. ఆయన అభిప్రాయాలతో విభేదించే వారూ నారావారి పల్లెలో ఉన్నారని… అందుకు తగ్గిన మెజారిటీనే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ చర్చ ఎటు దారి తీస్తుందో.. అమరావతి వ్యవహారం ఎప్పుడు చల్లబడుతుందో… చూడాలి.