Telugu Global
NEWS

మేడారం జాతరకు వెళ్తున్నారా.... ఈ వివరాలు మీ కోసమే!

జన జాతర.. వన జాతర. ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా.. గిరిజన సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిపేలా.. దక్షిణ భారత దేశ రాష్ట్రాల గిరిజనలు హాజరై.. అమ్మలగన్నయమ్మలను కొలిచేలా జరిగే ఈ మహా జాతర.. ఎల్లుండి నుంచే.. అంటే ఫిబ్రవరి ఐదు నుంచే జరగబోతోంది. ఇప్పటికే మేడారం భక్త జన సంద్రంగా మారింది. నిన్న ఆదివారం నాడు ఒక్కరోజే.. ఆరు […]

మేడారం జాతరకు వెళ్తున్నారా.... ఈ వివరాలు మీ కోసమే!
X

జన జాతర.. వన జాతర. ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా.. గిరిజన సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిపేలా.. దక్షిణ భారత దేశ రాష్ట్రాల గిరిజనలు హాజరై.. అమ్మలగన్నయమ్మలను కొలిచేలా జరిగే ఈ మహా జాతర.. ఎల్లుండి నుంచే.. అంటే ఫిబ్రవరి ఐదు నుంచే జరగబోతోంది.

ఇప్పటికే మేడారం భక్త జన సంద్రంగా మారింది. నిన్న ఆదివారం నాడు ఒక్కరోజే.. ఆరు లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నారు. ఇంతలా తరలి వస్తున్న భక్తుల కోసం.. తెలంగాణ ఆర్టీసీ తో పాటు.. దక్షిణ మధ్య రైల్వే.. ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఆర్టీసీ ఆధ్వర్యంలో.. హైదరాబాద్ జేబీఎస్ నుంచి 94.. దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ క్రాస్, జగద్గిరిగుట్ట నుంచి 36, కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు నుంచి 36.. మియాపూర్ నుంచి 23.. లింగంపల్లి నుంచి 23.. నేరేడ్ మెట్ నుంచి 21 బస్సులు… వరంగల్, హన్మకొండ నుంచి కూడా వందల సంఖ్యలో బస్సులు మేడారానికి రాకపోకలు సాగిస్తున్నాయి.

సికింద్రాబాద్ తోపాటు.. సిర్ పూర్ కాగజ్ నగర్ నుంచి మొత్తం 20 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సిద్ధం చేసింది. అలాగే.. హెలికాప్టర్ లోనూ మేడారానికి వెళ్లి వచ్చే ఏర్పాట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇక.. జాతర విషయానికి వస్తే.. ఈనెల 5న బుధవారం.. సారలమ్మ.. 6న గురువారం సమ్మక్క.. తమ గద్దెలకు చేరుకుని భక్తులను ఆశీర్వదిస్తారు. 7 న దర్శనాలు, మొక్కుల అనంతరం.. 8న అమ్మవార్ల వన ప్రవేశంతో మహా జాతర ముగుస్తుంది.

తెలంగాణ నుంచి మాత్రమే కాక.. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచీ.. భక్తులు పెద్ద ఎత్తున మేడారం జాతరకు తరలివస్తున్నారు. ఈ మేరకు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

First Published:  2 Feb 2020 11:27 PM GMT
Next Story