Telugu Global
NEWS

టీ-20 క్రికెట్లో బుమ్రా ప్రపంచ రికార్డు

న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్ లో బుమ్రా షో భారత ఫాస్ట్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా…ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కులశేఖర పేరుతో ఉన్న అత్యధిక మేడిన్ ఓవర్ల రికార్డును…న్యూజిలాండ్ తో ముగిసిన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ద్వారా బుమ్రా అధిగమించాడు. మౌంట్ మోనాగు లోని బే ఓవల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఆఖరి టీ-20లో బుమ్రా అత్యుత్తమ […]

టీ-20 క్రికెట్లో బుమ్రా ప్రపంచ రికార్డు
X
  • న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్ లో బుమ్రా షో

భారత ఫాస్ట్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా…ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కులశేఖర పేరుతో ఉన్న అత్యధిక మేడిన్ ఓవర్ల రికార్డును…న్యూజిలాండ్ తో ముగిసిన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ద్వారా బుమ్రా అధిగమించాడు.

మౌంట్ మోనాగు లోని బే ఓవల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఆఖరి టీ-20లో బుమ్రా అత్యుత్తమ బౌలింగ్ ప్రతిభ కనబరిచాడు. తన కోటా 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.

ఈ క్రమంలో…. ఐదుమ్యాచ్ ల సిరీస్ లో అత్యధికంగా 7 మేడిన్ ఓవర్లు వేసిన తొలిబౌలర్ గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

టీ-20 క్రికెట్లో ఇప్పటి వరకూ అత్యధిక మేడిన్ ఓవర్లు వేసిన ప్రపంచరికార్డు శ్రీలంక బౌలర్ కులశేఖర్ పేరుతో మాత్రమే ఉంది. నువాన్ కులశేఖర తన కెరియర్ లో ఆడిన మొత్తం 58 మ్యాచ్ ల్లో ఆరు మేడిన్ ఓవర్లు వేయగా… ఆ రికార్డును బుమ్రా 7 మేడిన్ ఓవర్లతో పటాపంచలు చేశాడు.

న్యూజిలాండ్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్ సాధించడంలో బుమ్రా తనవంతు పాత్ర నిర్వర్తించాడు. టీ-20 చరిత్రలోనే ఐదుమ్యాచ్ ల సిరీస్ ను 5-0తో నెగ్గిన తొలిజట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పడం విశేషం.

First Published:  2 Feb 2020 8:48 PM GMT
Next Story