కేంద్రంతో పోరాటానికి సిద్ధం.... జగన్ అనుమతే ఆలస్యం
రాష్ట్రానికి బడ్జెట్ లో కేటాయింపులపై.. వైసీపీ ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు.. కేంద్రానికి తమ నిరసనను వ్యక్తం చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదని.. అసలు కేంద్రం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందన్న ఆలోచనలో ఉన్న వైసీపీ ఎంపీలు.. అవసరమైతే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణ నిర్ణయించాలని భావిస్తున్నారు. కానీ.. ఈ సమావేశం నిర్వహించేందుకు వారు అధినేత జగన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. తమ ఆలోచనలను జగన్ కు వివరించి.. ఆయన ఇచ్చే […]
రాష్ట్రానికి బడ్జెట్ లో కేటాయింపులపై.. వైసీపీ ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు.. కేంద్రానికి తమ నిరసనను వ్యక్తం చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదని.. అసలు కేంద్రం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందన్న ఆలోచనలో ఉన్న వైసీపీ ఎంపీలు.. అవసరమైతే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణ నిర్ణయించాలని భావిస్తున్నారు.
కానీ.. ఈ సమావేశం నిర్వహించేందుకు వారు అధినేత జగన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. తమ ఆలోచనలను జగన్ కు వివరించి.. ఆయన ఇచ్చే సూచనలు, మార్గదర్శకాల ఆధారంగానే పోరాటం చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు.. ఈ నిరసనను వ్యక్తం చేసే క్రమంలో.. బీజేపీతో గతంలో మాదిరిగానే తటస్థ వైఖరి కొనసాగించాలా.. నిరసన తెలపాలా.. అన్న విషయంపైనా వారు సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది.
వైసీపీ ఎంపీలు.. ప్రధానంగా మూడు విషయాలపై దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో మొదటిది ప్రత్యేక హోదా. రెండోది కీలక ప్రాజెక్టులకు నిధులు.. మూడోది వెనకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు. ఈ మూడు విషయాల్లోనూ.. కేంద్రం మనకు మొండి చేయే చూపిందన్న భావనతోనే.. వారంతా ప్రత్యేకంగా సమావేశమై పోరాటానికి సిద్ధపడుతున్నారని.. రాష్ట్ర ప్రజల మనోభావాలు కేంద్రానికి తెలిపే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ ప్రయత్నంపై.. జగన్ ఎలా స్పందిస్తారు? పార్టీ ఎంపీలకు ఎలాంటి మార్గ నిర్దేశం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.