Telugu Global
NEWS

రాపాక, లక్ష్మీనారాయణపై... పవన్ సంచలన వ్యాఖ్యలు

జనసేనను వీడుతున్న.. వీడబోతున్న సంకేతాలు ఇస్తున్న నేతలపై.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తరఫున ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ గురించి.. ఇటీవలే రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ లక్ష్మీ నారాయణ గురించి.. ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు.. రాపాక జనసేనలో ఉన్నారో లేదో తనకు తెలియదని చెప్పారు. తాను కాపలా రాజకీయాలు చేయలేనని అన్న పవన్.. ఎవరైనా నేతలు ఇష్టంతో పార్టీలో ఉండాలి […]

రాపాక, లక్ష్మీనారాయణపై... పవన్ సంచలన వ్యాఖ్యలు
X

జనసేనను వీడుతున్న.. వీడబోతున్న సంకేతాలు ఇస్తున్న నేతలపై.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తరఫున ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ గురించి.. ఇటీవలే రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ లక్ష్మీ నారాయణ గురించి.. ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు.. రాపాక జనసేనలో ఉన్నారో లేదో తనకు తెలియదని చెప్పారు.

తాను కాపలా రాజకీయాలు చేయలేనని అన్న పవన్.. ఎవరైనా నేతలు ఇష్టంతో పార్టీలో ఉండాలి కానీ.. బలవంతంగా ఉండాలని చెప్పేది లేదని తేల్చారు. అలాగే.. తన తీరును నిరసిస్తూ ఇటీవల పార్టీని వీడిన లక్ష్మీనారాయణ గురించి కూడా.. కాస్త కఠువుగానే స్పందించారు పవన్.

ఎన్నికలప్పుడు చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి.. ఇప్పుడు తన విధానాలు బాగాలేవని చెప్పి వెళ్లిపోయేవారి గురించి స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

సినిమాల గురించీ పవన్ స్పందించారు. తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. తనను నమ్ముకుని బతికే వారిని పోషించుకోవడానికి.. పార్టీని ముందుకు నడిపించడానికి.. తనకు డబ్బు అవసరమని.. అందుకే తాను సినిమాలు చేయాల్సి వస్తోందని అన్నారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో.. విజయవాడ తూర్పు, నరసారావుపేట నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం సందర్భంగా పవన్ ఇలా వివరణ ఇచ్చుకున్నారు.

First Published:  2 Feb 2020 12:07 AM GMT
Next Story