Telugu Global
NEWS

పాపం కర్నూలు అమ్మాయి... 14న పెళ్లి... చైనాలో చిక్కుకుంది!

కరోనా ప్రభావం.. ఆరోగ్యాలమీదే కాదు.. పెళ్లి ముహూర్తాలపైనా ప్రభావం చూపిస్తోంది. కర్నూలు జిల్లా ఈర్ణపాడుకు చెందిన అమ్మాయి శృతి విషయంలో జరిగిన ఈ ఘటన.. వారి కుటుంబాన్ని ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తోంది. అసలు విషయం ఏంటంటే.. టీసీఎల్ సంస్థలో ఉద్యోగానికి ఎంపికైన శృతి.. మూడు నెలల శిక్షణ కోసం వుహాన్ పట్టణానికి వెళ్లింది. ఆమెకు జ్వరం సోకడంతో.. భారత్ పంపేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో పరీక్షిస్తున్నారు. ఇంకో ప్రధాన విషయం ఏంటంటే.. ఈ […]

పాపం కర్నూలు అమ్మాయి... 14న పెళ్లి... చైనాలో చిక్కుకుంది!
X

కరోనా ప్రభావం.. ఆరోగ్యాలమీదే కాదు.. పెళ్లి ముహూర్తాలపైనా ప్రభావం చూపిస్తోంది. కర్నూలు జిల్లా ఈర్ణపాడుకు చెందిన అమ్మాయి శృతి విషయంలో జరిగిన ఈ ఘటన.. వారి కుటుంబాన్ని ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. టీసీఎల్ సంస్థలో ఉద్యోగానికి ఎంపికైన శృతి.. మూడు నెలల శిక్షణ కోసం వుహాన్ పట్టణానికి వెళ్లింది. ఆమెకు జ్వరం సోకడంతో.. భారత్ పంపేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో పరీక్షిస్తున్నారు.

ఇంకో ప్రధాన విషయం ఏంటంటే.. ఈ నెల 14న శృతి పెళ్లి. సమయం దగ్గర పడుతుండడంతో.. ఆమె కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు శృతి ఇలా వుహాన్ లో చిక్కుకుపోవడంపై ఆందోళన చెందుతున్నారు.

తమ కూతురు.. చైనా నుంచి పంపిన వీడియో సందేశాన్ని మీడియాకు చూపారు. కరోనా లక్షణాలే లేవని.. తనకు సాధారణ జ్వరమే అని చెబుతూ.. శృతి పంపిన వీడియో మెసేజ్ ను ఆమె తల్లి ప్రమీలా అందరికీ చూపించారు. ఈ విషయంలో.. ప్రభుత్వం కలగజేసుకుని శృతిని త్వరగా ఇంటికి రప్పించేలా చూడాలని వేడుకుంటున్నారు. భారత్ నుంచి చైనాకు వెళ్లిన 58 మందిలో శృతి కూడా ఒకరని చెప్పారు.

అయితే ఈ విషయంలో చైనా అధికారులు…. శృతికి జ్వరం తగ్గి మామూలు స్థితికి వచ్చాక, కరోనా లేదని ధృవీకరించుకున్నాకే… ఇండియాకు పంపే అవకాశం ఉందని చెబుతున్నారు.

First Published:  2 Feb 2020 2:00 AM GMT
Next Story