Telugu Global
NEWS

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ నయాక్వీన్ సోఫియా కెనిన్

ఫైనల్లో పోరాడి ఓడిన గార్బిన్ ముగురుజా గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో సరికొత్త చాంపియన్ల వేదికగా పేరుపొందిన ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కొత్త సంవత్సరంలో నయా చాంపియన్ అవతరించింది. రష్యాలో జన్మించి… అమెరికాలో పెరిగిన 21 సంవత్సరాల సోఫియా కెనిన్ …తొలిసారిగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించింది. 14వ సీడ్ గా టైటిల్ వేటకు దిగి…తనకంటే మెరుగైన నలుగురు సీడెడ్ ప్లేయర్లను కంగుతినిపించడం ద్వారా ఫైనల్స్ చేరిన సోఫియా కెనిన్…టైటిల్ సమరంలో… 32వ సీడ్ […]

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ నయాక్వీన్ సోఫియా కెనిన్
X
  • ఫైనల్లో పోరాడి ఓడిన గార్బిన్ ముగురుజా

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో సరికొత్త చాంపియన్ల వేదికగా పేరుపొందిన ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కొత్త సంవత్సరంలో నయా చాంపియన్ అవతరించింది. రష్యాలో జన్మించి… అమెరికాలో పెరిగిన 21 సంవత్సరాల సోఫియా కెనిన్ …తొలిసారిగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించింది.

14వ సీడ్ గా టైటిల్ వేటకు దిగి…తనకంటే మెరుగైన నలుగురు సీడెడ్ ప్లేయర్లను కంగుతినిపించడం ద్వారా ఫైనల్స్ చేరిన సోఫియా కెనిన్…టైటిల్ సమరంలో… 32వ సీడ్ గార్బిన్ ముగురుజాను మూడుసెట్ల హోరాహోరీ సమరంలో అధిగమించింది.

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా ముగిసిన ఈ పోరులో..తొలిసెట్ ను స్పెయిన్ జెయింట్ ముగురుజా6-4తో సొంతం చేసుకొంది. అయితే..ఆ తర్వాతి రెండుసెట్లను యువసంచలనం కెనిన్ 6-2, 6-2తో నెగ్గడం ద్వారా విజేతగా నిలిచింది.

2007లో మారియా షరపోవా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన తర్వాత..అత్యంత పిన్నవయసులో విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా సోఫియా కెనిన్ రికార్డుల్లో చేరింది.

తన జీవితలక్ష్యం 21 సంవత్సరాల వయసులోనే నెరవేరడాన్ని నమ్మలేకపోతున్నానంటూ కెనిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది.
చాంపియన్ కు ఇచ్చే ట్రోఫీతో పాటు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సైతం కెనిన్ అందుకొంది. రెండేళ్ల విరామం తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ చేరిన ముగురుజా రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

First Published:  1 Feb 2020 9:00 PM GMT
Next Story